గురువారం నాడు సాయినాధుని ప్రార్థన చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అసలు గురువారం నాడు ఈ ప్రార్థన, పూజలు రకరకాలు చేస్తుంటారు. ఒకొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తారు. సాయినాధుని పటాన్ని, విగ్రహాన్ని పెట్టి. ఆ తర్వాత నుదిటిపై చందనాన్ని, తిలకాన్ని దిద్ది పూలమాలలను, పసుపు ఇత్యాది వాటిని సాయిబాబాకు సమర్పించాలి.
ఆ తర్వాత దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించాలి. అటు తర్వాత సాంబ్రాణి, అగరు ధూపములను సమర్పించి... చక్కర, మిఠాయి వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఆచరించు భక్తుడు ఒకే పూట భోజనం చేయాలి. అంతేతప్ప కడుపు మాడ్చుకుని ఈ వ్రతాన్ని చేయకూడదు. వ్రతం చేసిన తర్వాత నైవేద్యాన్ని వ్రతములో కూర్చున్నవారికి పంచాలి. ఇలా తొమ్మిది గురువారాలు ఈ వ్రతాన్ని చేయాలి.
కోరిన కోర్కెలు తీర్చి, కష్టాల నుంచి గట్టెక్కించే ఇష్టదైవంగా సాయిబాబాను చాలా మంది భక్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తూ సాయినాథుని క్షేత్రమైన షిరిడీకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లి ఆయన్ను దర్శించుకుంటూ ఉంటారు. ప్రధానంగా గురువారం పూట ఆయన్ను దర్శిస్తే ఇంకా చాలా మంచిదని, అనుకున్నవి వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. దీంతోపాటు గురువారం నాడు కొన్ని సూచనలు పాటిస్తే దాంతో సాయిబాబా అనుగ్రహం వెంటనే పొందవచ్చని కొందరు అంటుంటారు. కాని దేవుడు ఎప్పుడూ ఫలాన్ని ఫితాన్ని ఆశించి మనల్ని అనుగ్రహించడు. ఇవన్నీ కేవలం మన మనశ్శాంతి కోసమే అని మరికొందరు అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ వీటిలో మనం దేవుడికి పెట్టే నైవేద్యం కావొచ్చు మనం తీసుకునే ఆహారం కావొచ్చు కొన్ని మార్పులు ఉంటాయి. వాటి వల్ల అటు దైవానుగ్రహం ఇటు మంచి ఆరోగ్యం రెండూ లభిస్తాయి.
పాలకూర…
సాయిబాబాకు పాలకూర అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే గురువారం నాడు దాన్ని సాయిబాబాకు నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయని భక్తుల సమస్యలు తీరుతాయని కొందురు నమ్ముతారు.
హల్వా…
సాయిబాబాకు ప్రియమైన వంటకాల్లో హల్వా కూడా ఒకటి. కొందరు భక్తులు బాబాకు హల్వాను నైవేద్యంగా పెడతారు. అయితే దీన్ని గురువారం నాడు సమర్పిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందట.
కిచ్డీ…
కిచ్డీ కూడా సాయిబాబాకు ఇష్టమైన వంటకమే. భక్తులు ప్రేమతో కిచ్డీని పెడితే బాబా కచ్చితంగా స్వీకరిస్తారట. దీంతో వారు అనుకున్నవి నెరవేరుతాయట.
కొబ్బరి కాయ…
చాలా మంది దేవుళ్ల లాగే బాబాకు కూడా కొబ్బరి కాయ అన్నా ఇష్టమే. భక్తితో టెంకాయ కొడితే సాయి అనుగ్రహం తప్పక లభిస్తుంది. గురువారం నాడు దీన్ని సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.
పూలు, పండ్లు…
సువాసనలను వెదజల్లే పూలు, తియ్యని పండ్లు అన్నా బాబాకు ఇష్టమే. వాటిని సమర్పించినా భక్తుల కోరికలు నెరవేరుతాయి.
ఈ విధంగా బాబును ప్రతి గురువారం పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా తీరుతుందని కోరిన కోర్కెలు తీరతాయని కొందరి విశ్వసిస్తుంటారు.