దాన ఫలం

Prasad
దాహార్తులు త్రాగినంత మాత్రాన గంగానదికి లోటు లేనట్లే దానం చేసినంత మాత్రాన నీ సంపద తరిగిపోదు. నీ ఆదాయంలో దశాంశ భాగం దాన ధర్మాలకు వినియోగించు. సత్వరంగా, సంతోషంగా సందేహించకుండా ఇస్తూ ఉండు. దానాన్ని ఎప్పుడూ వాయిదా వెయ్యవద్దు. నీవు చేసే ప్రార్థన నిన్ను భగవానుని సమీపానికి సగం దూరం మాత్రమే తీసుకువెడుతుంది. ఉపవాసం నిన్ను అతని ముంగిట చేరుస్తుంది. కానీ నీ దానగుణం మాత్రమే లోనికి ప్రవేశింపచేస్తుంది. కాబట్టి దాన గుణాన్ని విడవకు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: