స్త్రీలు ‘ఓం’కారాన్ని జపించవచ్చా?

Durga
స్త్ర్రీలు ‘ఓం’కారాన్ని జపించుటకు సమ్మతించబడలేదు. ఇందుకు వారి శరీర నిర్మాణ వ్యవస్థే కారణం. ఓం కారాన్ని బిగ్గరగా(బయటకు శబ్దం వచ్చునట్లు) జపించుటకై దీర్ఘమైన, క్రమమైన, నెమ్మదైన విధానంలో గాలిని (శ్వాసను) బయటకు విడువవలసి ఉంటుంది. అలా ‘ఓం’ను ఉచ్ఛరించినప్పుడు శరీరం నుండి చుట్టూతా హెచ్చు స్థాయిలో ఉండే శక్తి తరంగాలు వ్యక్తమౌతాయి. ఇలాంటి శబ్ధతరంగాలు ఉత్పన్నమౌతున్నమధ్య బాగంలో గర్భాశయం ఉండటం కారణంగా ఈ శబ్ధతరంగాలు గర్భాశయాన్ని విరుద్దంగా ప్రభావితం చేయడం మరియు మూసుకు పోయోలా చేయడం జరిగే ప్రమాదం ఉంది. ఐదారు సార్లు ‘ఓం’కారాన్ని చేయడం అంత ఇబ్బందికరమైనది కాదు కానీ అలా చాలా సేపు చేయడం ఇబ్బందులకు దారితీస్తుంది. అది మాత్రమే కాక స్త్రీ అలా చాలా సేపు శ్వాసను క్రమబద్దీకరించుకుంటూ ‘ఓం’ కారాన్ని జపించే విధంగా ఆమె స్వర యంత్రాంగం అనుకూలంగా ఉండదు. కావున స్త్రీలు ‘ఓం’కారాన్ని జపించరాదనే నియమం పెట్టారు. సూధీర్ఘంగా కాక కొద్ది సమయంలోనే ‘ఓం’ కారాన్ని పూర్తి చేసినట్లయితే స్త్రీలకు ఇబ్బంది ఏమీలేదు. మానసిక జపానికి నియమమంటూ ఏమీలేదు. మానసిక జపానికి నియమమంటూ ఏమీలేదు, నిర్భయంగా జపించుకోవచ్చు. శ్వాసను బిగబట్టి చదువు మంత్రాల జోలికి వెళ్లకుండా ఉండే ఏ దేవతా మంత్రాన్నైనా లేదా శ్లోకాలనైనా స్త్రీలు సాధన చేయవచ్చనేది పెద్దల మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: