స్మరణ : 64 యేళ్ళ వయసులో నటుడిగా.. నంది అవార్డ్..

Divya

సినీ ఇండస్ట్రీలోకి కొంతమంది బాలనటులుగా అడుగు పెట్టి, ఆ తర్వాత స్టార్స్ గా తమ ప్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు. మరి కొంతమంది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తమ సినీ జీవితాన్ని అత్యద్భుతంగా మార్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన శేష జీవితం అనుభవిస్తున్న సమయంలో, అంటే తనకు 64 సంవత్సరాల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తరువాత దాదాపు 30 చిత్రాలలో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఇక ఆయన ఎవరు..? ఏ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు..? ఆ విశేషాలు ఏమిటో ..?ఇప్పుడు తెలుసుకుందాం..


వేదం నాగయ్య.. ఈయన అసలు పేరు మాదాసు నాగయ్య. ఇక 2010లో మంచు మనోజ్, అల్లు అర్జున్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం వేదం. నాగయ్య ఈ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు కాబట్టి ఈయనను వేదం నాగయ్య గా పిలవడం మొదలు పెట్టారు. ఇలా మాదాసు నాగయ్యగా గుంటూరు జిల్లా లోని నకరికల్లు మండలం పరిధిలో దేచవరం అనే గ్రామంలో జన్మించారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు బ్రతుకు జీవనం కోసం గొడుగులు అమ్ముకుంటూ జీవించసాగారు. ఒకసారి వేదం సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈ సినిమాలోకి నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు.

ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించినప్పటికీ, వయసుకు తగ్గ పాత్రలో నటించి , అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పల్లెటూరి వృద్ధుడిగా నటించిన నటనకు, ఆయనకు నంది అవార్డు కూడా లభించింది. తర్వాత రామయ్య వస్తావయ్యా, స్పైడర్, నాగవల్లి వంటి మొత్తం 30 చిత్రాలలో నటించాడు. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఈయన, తన 75 సంవత్సరాల వయసులో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, తన సొంత ఊరైన దేచవరంలో తన ఇంటిలో 2021 మార్చి 27వ తేదీన స్వర్గస్తులయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కూతురు కూడా ఉన్నారు. ఏదిఏమైనా అరవై నాలుగు సంవత్సరాల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంటే అది అతిశయోక్తి కాదు. ఇక అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలవడం అంటే ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: