స్మరణ : రవితేజ సోదరుడు భరత్ ఎలా మరణించారో తెలుసా..?

Divya

సినీ ఇండస్ట్రీలోకి రవితేజ హీరోగా అడుగు పెట్టడం వెనుక, ఈయన ఎన్ని కష్టాలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా అడుగుపెట్టాలనుకుని వచ్చిన ఈయన, సహాయ పాత్రల్లో నటించి, ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఇక అప్పట్లో స్టార్ హీరోల ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా నటించి, అందరి మన్ననలు పొందారు. ఇక ఆ తర్వాత హీరోగా తన స్థానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరో గా తన హవాను  కొనసాగిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన కిక్ సినిమా ద్వారా మళ్లీ  రేసులోకి అడుగుపెట్టారు మాస్ మహారాజ రవితేజ.


రవితేజకు ఇద్దరు తమ్ముళ్ళు.. ఇక పెద్ద తమ్ముడు భూపతిరాజు భరత్ రాజు , రెండవ తమ్ముడు రఘు.  పెద్ద తమ్ముడు భరత్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. భరత్ కొన్ని సినిమాలకు విలన్ పాత్రలలో రామ రామ కృష్ణ కృష్ణ, జంప్ జిలాని, ఆ ముగ్గురు, రెడీ, అతడే ఓ సైన్యం, దూకుడు వంటి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు. ఇక ఈయన 2017 జూన్ 24వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించారు.


ఈయన 2017 జూన్ 24వ తేదీన రాత్రి 10 గంటలకు శంషాబాద్ నుండి గచ్చిబౌలికి వెళ్తుండగా, మధ్యలో ఆగి ఉన్న లారీని భరత్, అత్యంత వేగంతో స్కోడా కార్ లో ప్రయాణిస్తూ వెనుకనుంచి లారీని ఢీ కొట్టారు. కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తుపట్టలేని స్థితిలో భరత్ కన్నుమూసారు. చనిపోయిన సమయంలో కేవలం కారులో ఈయన  మాత్రమే ఉన్నట్టు పోలీసులు తేల్చి చెప్పారు. అంతేకాదు ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అందుకే హీరో రవితేజ తమ్ముడు అని గుర్తు పట్టలేక పోయాము  అని పోలీసులు చెప్పారు. ఆయన కారు నంబర్ ఆధారంగా ఆయన కుటుంబ సభ్యులు, భరత్ ను  గుర్తించినట్లు కూడా తెలపడం జరిగింది. కేవలం 46 సంవత్సరాల వయసులోనే భరత్ స్వర్గస్తులయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: