హెరాల్డ్ స్మరామీ : మలేరియా వ్యాప్తి రహస్యాన్ని చేధించిన సర్ రోనాల్డ్ రాస్...
భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత, అతను లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అధ్యాపకులలో ఒకనిగా చేరాడు. 10 సంవత్సరాల పాటు ఇనిస్టిట్యూట్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ , చైర్మన్ గా కొనసాగాడు. 1926 లో అతను రాస్ ఇనిస్టిట్యూట్, హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ లకు డైరెక్టర్-ఇన్-చీఫ్ అయ్యాడు. ఇది అతని రచనలను గౌరవించటానికి స్థాపించబడింది. అతను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. అతను హైదరాబాదు నగరంలో తన పరిశోధన జరిపాడు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్"గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు.
పక్షులలో మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు రోనాల్డ్ రాస్‌కు నోబెల్ బహుమతి లభించింది. అతను మలేరియా ప్రసార భావనను మానవులలోనే కాకుండా పక్షులలో కూడా ఉంటుందని తెలియజేసాడు. సోకిన దోమల కాటు ద్వారా మలేరియా పరాన్నజీవి సంక్రమిస్తుందని రాస్ మొట్టమొదట చూపించాడు, 1897 లో, ఒక ఇటాలియన్ వైద్యుడు, జంతుశాస్త్రజ్ఞుడు గియోవన్నీ బాటిస్టా గ్రాస్సీ, అతని సహచరులతో కలిసి, అనోఫెలిన్ దోమలలో మలేరియా పరాన్నజీవుల అభివృద్ధి దశలను స్థాపించారు; తరువాతి సంవత్సరం పి. ఫాల్సిపరం, పి. వివాక్స్, పి. మలేరియాల పూర్తి జీవిత చక్రాలను వివరించారు. ఫిజియాలజీ లేదా మెడిసిన్ కోసం 1902 నోబెల్ బహుమతి పరిగణించబడినప్పుడు, నోబెల్ కమిటీ మొదట ఈ బహుమతిని రాస్, గ్రాస్సీలు కలసి పంచుకోవాలని భావించింది, అయితే గ్రాస్ ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని రాస్ ఆరోపించాడు. కమిటీలో నియమించబడిన తటస్థ మధ్యవర్తి రాబర్ట్ కోచ్ ప్రభావాల వల్ల, రాస్ కు అనుకూలంగా వచ్చింది.16 సెప్టెంబరు 1932లో 75 ఏళ్ల వయస్సులో రాస్ లండన్‌లో అనారోగ్యంతో కన్నుమూశాడు.