హెరాల్డ్ స్మరామీ : నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు
సరోజినీ నాయుడు హైదరాబాదులో జన్మించారు. తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ హైదరాబాదు కాలేజికి, అనగా నేటి నిజాం కాలేజీ మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాసేవారు. తండ్రి గారైన అఘోరనాథ్ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడింబరో విశ్వవిద్యాలయంలో డాక్టరు పట్టాను పొందటం జరిగింది. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళాలో వారి తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ నివాసముండేవారు.
దీనిని సరోజినీ నాయుడుగారి తదనంతరం వారి ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చారు. 1898 వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక, ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని వివాహం చేసుకున్నారు. తనే దేశం, దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహితాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితము చేసి తన డబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్ను మూసింది.