డిఫ‌రెంట్ విల‌నిజాన్ని ప‌రిచ‌యం చేసిన పుండ‌రీకాక్ష‌య్య‌

frame డిఫ‌రెంట్ విల‌నిజాన్ని ప‌రిచ‌యం చేసిన పుండ‌రీకాక్ష‌య్య‌

Spyder
అట్లూరి పుండరీకాక్షయ్య కృష్ణా జిల్లా చౌటుప్పలో 1925 ఆగస్టు 19న జన్మించారు.  ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే ఎన్టీఆర్‌తో  పరిచయం ఏర్పడింది.  ఎన్టీఆర్‌పై అభిమానంతో 1962లో నర్రా రామబ్రహ్మంతో కలిసి గౌతమీ పిక్చర్స్ బ్యానర్‌పై చారిత్రక చిత్రం ‘మహామంత్రి తిమ్మరసు’ రూపొందించారు. తరువాత 1967లో కె తిరుపతయ్య (నిర్మాత దేవీవరప్రసాద్ తండ్రి) సమర్పణలో తారకరామా పిక్చర్స్ పతాకంపై ‘శ్రీకృష్ణావతారం’ పౌరాణిక చిత్రం నిర్మించారు.

 మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.కర్తవ్యం సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను పరుచూరి బ్రదర్స్తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా ఏ.యం.రత్నం పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత శివయ్య, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ మొదలైన 20 తెలుగు, 5 కన్నడ సినిమాల్లో నటించాడు.

 సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది. కొంతకాలం అనారోగ్యంతో బాధపడిన పుండరీకాక్షయ్య చెన్నై లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, ఫిబ్రవరి 2 గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కన్నుమూసారు. దర్శకుడి పర్యవేక్షణ అన్నింటిమీద ఉన్నా, పుండరీకాక్షయ్య దర్శకుడికి సహాయకుడిగా, తన ఆలోచనలు కూడా జోడిస్తూ, నిర్మాణ సక్రమ విధానానికి దోహదం చేసేవార‌ట‌. ‘మహామంత్రి తిమ్మరుసు’. 1962లో ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా రాష్ట్రపతి రజత పతకం తెచ్చుకుంది. నాటి రాష్ట్రపతి ప్రత్యేకంగా చిత్రాన్ని తెప్పించుకొని మూడుసార్లు చూశారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: