చైనా ఆంక్షలు : విడాకుల విషయంలో ప్రభుత్వ పెత్తనం..!
తమకు కలిసి జీవించడం ఇష్టం లేదు విడాకులు ఇవ్వాలని కోరితె దానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ జీవిత భాగస్వామి తమను మోసం చేశారంటూ కోర్టుకెక్కుతున్న జంటలకు షాక్ ఇస్తోంది చైనా కోర్ట్. ఈ కారణంతో విడాకులకు కోరే జంటలకు విడాకులు ఇచ్చేది లేదని చైనాలోని ఓ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పుపై చైనాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. చైనాలో ఉన్న షా జాంగ్ అనే కోర్టు మోసం అని కారణంతో విడాకులు కావాలంటే ఇవ్వబోమని తేల్చి చెప్పింది. గతేడాది చైనా విడాకుల చట్టంలోని కొన్ని సవరణలు చేసి మార్పులు చేసింది. దీంతో జంటలు విడాకులు తీసుకోవడం కష్టతరం అవుతోంది.
అయితే, కొత్త నియమాల ప్రకారం దంపతులు విడాకులు తీసుకోవాలంటే నెల రోజుల పాటు కలిసి ఉండాలి. దీనికి అసలు కారణం వారు విడిపోకుండా ఉంచడానికి. ఈ నెల రోజుల్లో వారిద్దరి మధ్య వైవాహిక సంబంధాలు మెరుగవుతాయని, మనస్పర్థలు తొలిగిపోతాయని ప్రభుత్వం ఉద్దేశంగా చెబుతున్నారు. ఒకవేళ ఆ నెల రోజుల తరువాత కూడా వారిద్దరు విడిపోవాలని అనుకుంటే అప్పుడు మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.