బంగారు కొండలకు కోరుకొండ అండ

RATNA KISHORE
వీరులు నడయాడిన నేలపై కొత్త స్వప్నం ఆవిష్కృతం..కలల సాకారం సాధ్యం. అందుకు తగ్గ వాతావరణం సృష్టి కూడా జరిగిపో యింది. నేలకూ నింగికీ మధ్య ఉన్న ఆ సన్నని గీత చెరిపే క్రమం ఒకటి మా ఊళ్లో మా నేలపై మా గాలుల్లో సాగిపోతున్నాయి. అవును రాజు గారి మాట మోడీ విన్నారహో ! అశోక్ గజపతి రాజు విన్నపం మేరకు ఈ ఏడాది కోరుకొండ సైనిక్ స్కూల్ లో బాలికలకు ప్రవేశం ఇస్తూ..తీసుకున్న నిర్ణయానికి మోడీ ఇచ్చిన మద్దతే కారణం. థాంక్ యూ పీఎం..

 

ఆడబిడ్డల ఆధిక్యం చదువులో ఉండాలి
ఉంటుంది అని అంటున్నారు
అశోక్.. ఎందుకని?


 
యుద్ధం ఎలా ఉన్నా చేయాల్సిందే. ఆడ - మగ అన్న లింగ వివక్షకు తావులేనిది యుద్ధ భూమి ఒక్కటే. మేం చదువుకుంటాం అంటే ఒప్పుకుంటాం..అమ్మాయిల విషయమై..అదే సైన్యంలో చేరుతాం అంటే తటపటాయిస్తాం.ఇకపై ఇలాంటి తర్జన భర్జన లేని చదు వు, దేశానికి పనికివచ్చే చదువు, ఉపాధికి మార్గం సుగమం చేసే చదువు కోరుకొండ సైనిక్ స్కూల్ అందించనుంది. ఆకాశంలో సగం అని చెప్పకండి ఇప్పుడు ఆకాశం మాదే మీరే మా గొడుగు కింద ఉంటున్నారు అని చెప్పండి అమ్మాయిలూ...ఈ మాట విం టూనే పొంగిపోవాలి. ఆనందించాలి. అశోక్ సర్ మీకు థాంక్స్.. బిడ్డలంతా ఇప్పుడు నింగీ నేలా మాదే అని ఓ మాస్ ఇండికేషన్ ఇ స్తున్నారు. తీసుకోండి ఏం కాదు. మా విజయ నగరంలో చదువులకు మరో మార్పు..చదువులకు కాదు చదువులలో అని రా యాలి నేను..
 



అమ్మాయిలంతా సైన్యంలో చేరాలి
అవును తప్పేం ఉంది చేరితే ఆనందం
అందుకు అశోక్ సహాయం చేశాడు
బిడ్డల చదువుతో పాటు సైన్యంలో అడుగు
అన్నది కూడా ముఖ్యం అన్నది ఆయన భావన
ఆడ బిడ్డలకు ఈ అవకాశం ఇచ్చి తన చరిత్రను
తానే పునః నిర్వచించుకున్నాడు..


రాజులన్నా సైన్యాలన్నా మక్కువ ఎక్కువ ఉన్న ప్రాంతం విజయనగరం. సైన్యంలో ఆడ బిడ్డల చేరిక అంటే ఇంకా ఇష్టం అశోక్ గజప తి రాజుకు..గజపతి రాజులు మొదట్నుంచి కోరుకుంటున్నది ఇదే. అమ్మాయిల చదువు ఇంటికి వెలుగు..సైన్యంలో అడుగు దేశాని కే వెలుగు అని! ఆ మాట  నమ్ము కునే అశోక్ మోడీకి రికమెండ్ చేశాడు. తమ ప్రాంత కోరుకొండ సైనిక్ స్కూల్ లో అమ్మా యిలకు చదువు చెప్పించమని. ఎందుకు కాదు అవుతుంది ఆ మాట అన్నాడు మోడీ..వెంటనే కాకపోయినా కాస్త ఆలోచించి తీ సుకున్న ఈ నిర్ణయం ఈ దేశాన్ని మరింత ప్రభావితం చేయనుంది.ఈ విద్యా సం వత్సరం నుంచే బాలికలకు ఎంట్రీ దక్కనుంది. ఇం దుకు పాఠశాల వర్గాలు కూడా సమ్మతించాయి. మంచి మార్పులకు ఈ విద్యా సంవత్సరం శ్రీకారం దిద్దుతోంది. ఆ మార్పు దేశాని కో దిక్సూచి కావాలి.  కొత్త సైనికుల రాక కొత్త తారల రాకను ఆహ్వానించే క్రమాన్ని ప్రేమించాలి నేను.. ప్రేమించాలి మీరు. కొత్త సైని కులరా మీకిక స్వాగతం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: