జగన్ వాయిస్ ఎలా లీక్ అయ్యిందబ్బా?

Chakravarthi Kalyan
జర్నలిజం అంటే మీది ఏ పార్టీ పత్రిక లేదా చానల్ అడిగే పరిస్థితి వచ్చింది. అంతలా ఆయా మీడియా చానళ్లు, పత్రికలు వ్యవహరిస్తున్నాయి. అయితే తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై ఇష్టారీతిన వార్తలు రాస్తున్నారు. చంద్రజ్యోతిగా పేరున్న ఓ పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్ ను తీవ్రంగా హెచ్చరించారు. అంతే కాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాడు. వినకపోతే జైలుకు వెళ్లాల్సిందే అంటూ విచిత్రమైన వార్తలు రాస్తుంటారు.

ముఖ్యంగా కేంద్ర బృందాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ను తమ అధీనంలోకి తీసుకోబోతుంది అని, ఆర్థికంగా ఆంధ్ర పరిస్థితి దిగజారిపోయిందని చెబుతూ వక్రీకరించే వార్తలు రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి ఆర్థిక శాఖ అధికారులు వచ్చారు. ఇక రాష్ట్రానికి నిధులు రావని రాసుకొచ్చారు. ఇలా ఎలా రాస్తున్నారని అడిగితే మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇలాంటి వార్తలు రాయగలుగుతున్నాం అని  చెబుతున్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ, నలుగురు కూర్చొని మాట్లాడుకున్నారు. అయితే పొత్తుల విషయంపై చెప్పేస్తానని బాబుతో పవన్ కల్యాణ్ అన్నారని అయితే దానిపై బాబు ఇప్పుడొద్దు తర్వాత చెప్పండని అంటే లోకేశ్ మీ ఇష్టమని, బాలకృష్ణ కూడా మీ ఇష్టం బావ అని అన్నారని చివరకు ఒకే క్లారిటీ ఇచ్చేయ్ వపన్ అని చంద్రబాబు అన్నారని రాశారు. అసలు నలుగురు ములాఖత్ అయినా సమయంలో ఆ పత్రిక రిపోర్టర్‌ అక్కడ జైలులో ఏమైనా ఉన్నారా?

లేకపోతే ఈ నలుగురిలో ఒకరు ఆ పత్రికకు ఏమైనా వివరాలు చెప్పారా? కానీ ఇవేవీ తెలియకుండానే ఊహాజనిత వార్తలు రాస్తున్నారా? ప్రస్తుతం కొత్తగా లోకేశ్, రామోజీని లోపలేసేయండి అని జగన్ చెప్పినట్లు, శైలజా కిరణ్ విదేశాల్లో ఉన్నారు. దేవినేనిని కూడా అరెస్టు చేయాలని చెప్పినట్లు రాశారు. దీంతో బ్యూరోకాట్లు అందరూ ఈ దెబ్బకు లీవ్ పెట్టి వెళుతున్నట్లు రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: