చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా.. బెంగేట్టుసుకున్న ఆర్కే..?
అవును.. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే.. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాధాకృష్ణ ఎగిరి గంతేస్తాడు కానీ.. ఎందుకు బాధపడతాడు.. ఎందుకు బెంగ పెట్టుకుంటాడు.. అందులోనూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యక్రమాల లైవ్ టెలికాస్ట్ ఫీడ్ అందించే కమ్యూనికేషన్ ప్రాజెక్టులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికే కదా వస్తాయి.. ఆయన ఎందుకు బాధపడతాడు.. అంటారా.. అది నిజమే అనుకోండి. అయినా సరే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం రాధాకృష్ణ బాధపడి తీరతాడు..
ఎందుకో తెలుసుకోవాలంటే.. ఈ వారం ఆయన రాసిన కొత్త పలుకు సంపాదకీయం చదవాల్సిందే.. అందులో ఆయన ఏంరాశారో తెలుసా.. ఈ సీఎం జగన్ ఉన్నాడే.. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ చేస్తున్నాడు.. ఖాళీ చేస్తే చేశాడు పో.. అంతటితో ఆగకుండా విపరీతంగా అప్పుడు తెస్తున్నాడు.. తెస్తే తెచ్చాడుపో.. ఆ అప్పులు మరో 15-20 ఏళ్లలో తీరుస్తామంటూ అగ్రిమెంట్లు రాస్తున్నాడు.. అని తెగ బాధపడిపోతున్నారు. చంద్రబాబు అలా చేస్తే.. ఇక ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం ఏం లాభం.. ?
అసలు ఇలా అడ్డగోలుగా అప్పులు తెస్తే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల పరిస్థితేంటని ఆలోచించారా అంటూ జగన్ ను కడిగి పారేశాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. అదీ ఆయన బాధ. రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఈ అప్పుల భారంతో నలిగిపోతాడని.. రుణ రథ చక్రాల కింద అప్పచ్చి అయిపోతారని.. పాపం.. రాధాకృష్ణ ఇప్పటి నుంచే బెంగ పెట్టేసుకున్నారు. అదీ రాధాకృష్ణ బెంగ వెనుక అసలు కథ.