హెరాల్డ్ సెటైర్ : ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబే చెప్పాలి మరి

Vijaya
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక మొదలైన దగ్గర నుండి చంద్రబాబునాయుడు అండ్ కో ఒకటే గోల మొదలుపెట్టారు. అసలు పోలింగ్ ఊపందుకోకుండానే వైసీపీ దొంగఓట్లు వేయించేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసిందని, ఎన్నికల ప్రక్రియనే అపహస్యం చేసిందంటు నానా గోల చేశారు. ధౌర్జన్యాలతో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసుల సాయంతో ఎన్నికల్లో ఏకపక్ష పోలింగ్ కు వైసీపీ ప్రయత్నించిందంటు చంద్రబాబు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేశారు. చివరాఖరుకు ఉపఎన్నికను రద్దు చేయాలని, కుదరకపోతే కనీసం తిరుపతి అసెంబ్లీ ఎన్నిక రీపోలింగ్ జరపాలంటు డిమాండ్లు కూడా చేశారు. చంద్రబాబు ఆరోపణలు, డిమాండ్లు, ఫిర్యాదులు చూసిన వాళ్ళు నిజంగానే ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు ఎంతటి విశ్వాసమో అనుకునే ప్రమాదం ఉంది.



సీన్ కట్ చేస్తే 2015లో తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక జరిగింది. టీడీపీ తరపున సుగుణమ్మ పోటీచేస్తే కాంగ్రెస్ తరపున శ్రీదేవి పోటీచేసింది. వైసీపీ ఎన్నికలో పోటీచేయలేదు. అంటే రంగంలో ఉన్న పార్టీలను చూస్తే నామినేషన్ వేస్తేచాలు టీడీపీ అభ్యర్ధి గెలుపు ఖాయమని ఎవరికైనా అర్ధమైపోతుంది. ఇలాంటి ఎన్నికలో కూడా చంద్రబాబు ఏమిచేశారు. ప్రత్యర్ధిపార్టీకి కనీసం డిపాజిట్ కూడా రానీయద్దని పోలింగ్ ను ఏకపక్షం చేసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కొనేశారు. అమ్ముడుపోవటానికి ఇష్టపడని ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుండి తరిమేశారు. ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని రిగ్గింగ్, దొంగఓట్లను వేయించుకున్నారు. మొత్తానికి తమ అభ్యర్ధికి 1.16 లక్షల మెజారిటి వచ్చిందనిపించుకున్నారు.



ఇక తర్వాత జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక జరిగిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఈ ఎన్నిక టీడీపీ-వైసీపీ మధ్య పోటీపోటీగా జరిగింది. దాంతో చేయకూడని ప్రతిపనిని చంద్రబాబు చేశారు. తొక్కని అడ్డదారులు లేవు.  ప్రచారం సందర్భంగా వైసీపీ అభ్యర్ధితో పాటు ఎంఎల్ఏలు, నేతలందరినీ ఎంత ఇబ్బందులు పెట్టాలో అంతా పెట్టారు. నిజానికి అప్పట్లో ఫెయిర్ పోలింగ్ జరుగుంటే వైసీపీనే గెలిచేదని సర్వేల్లో తేలింది. కానీ టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారు. మంత్రులను, ఓ 30 మంది ఎంఎల్ఏలను, ఎంపిలను, నేతలందరినీ నంద్యాలలోనే మోహరించారు. అధికారులను, చివరకు కేంద్ర ఎన్నికల పరిశీలకులను కూడా లెక్కచేయలేదు. పోలీసులు చంద్రబాబు ఎలా చెబితే అలా ఆడారు. టీడీపీ ఎన్ని అరాచకాలు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. వ్యవస్ధలను ఇంతగా భ్రష్టుపట్టించి రెండు అసెంబ్లీల్లోను గెలిచారు. అలాంటి చంద్రబాబు ఇఫుడు ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల పవిత్రత గురించి మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: