హెరాల్డ్ సెటైర్:ఆయనను పట్టుకుని బాబు ఎందుకు వేలాడుతున్నారు...?

Gullapally Venkatesh
తెలుగుదేశం పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ముఖ్యంగా కొంతమంది కీలక నేతలను ఆయన పక్కన పెట్టకపోతే మాత్రం పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది కొత్త నాయకులు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు వస్తున్న సరే చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ విషయంలో దృష్టి పెట్టకపోవడంతో పార్టీ నేతలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. చాలామంది కీలక నేతల విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సానుకూలంగా ఉండటం ఎప్పుడూ తెలంగాణలో సమస్యలకు దారితీస్తుందనే భావన ఉంది.
ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో పార్టీ నేతలు కూడా ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే ఆయనను కొనసాగించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నం చేయడం గత ఏడేళ్ల నుంచి ఒకటే పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో కొనసాగడంతో పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా తెలంగాణలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టలేదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయినా... సరే ఆయన మాత్రం ముందుకు వెళ్లడం లేదు.
మున్సిపల్ ఎన్నికల్లో, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించ లేక పోయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ముందుకు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఓడిపోయినా సరే చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు రావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది పార్టీ కోసం సిద్ధంగా ఉన్నా సరే కొంతమంది మాత్రం ముందుకు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: