హెరాల్డ్ సెటైర్:సోము సార్ ఇక ప్రసంగాలు ఆపండి...!

Gullapally Venkatesh
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తోంది కాబట్టి కొన్ని కొన్ని అంశాలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. కానీ బిజెపి నేతలు మాత్రం ఈ విషయంలో ఘోరంగా తప్పులు చేస్తున్నారు. బిజెపి  జాతీయ అధ్యక్షుడు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పదేపదే ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పదేపదే కేంద్రం నుంచి డబ్బులు వచ్చాయి... ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాడటం లేదని ఎప్పటి నుంచో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

గత బిజెపి అధ్యక్షుడు కూడా రాష్ట్రంలో ఇదే విధంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి భారీగా వచ్చిన పరిస్థితి లేదు. ఇక రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా సరే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కీలకమైన హామీలను కూడా ఆంధ్రప్రదేశ్ లో నెరవేర్చే ప్రయత్నం చేయలేకపోయారు... అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు బిజెపి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఆందోళన కలిగించే విధంగా ఉంది.

ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని స్పష్టంగా చెప్పడంతో ఇక్కడ ఉన్న నేతలు కూడా ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యారు. బిజెపిపై వైసీపీ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచి ఇక్కడినుంచి విజయాత్ర మొదలుపెడతామని తిరుపతి అభివృద్ధి చేస్తామని బిజెపి  నేతలు పదేపదే చెబుతున్నారు కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా రాష్ట్రానికి బిజెపి  చేసే న్యాయం ఏంటి అనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. మరి ఇప్పటికైనా సరే బిజెపి నేతలు ఆలోచించకుంటారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: