హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఎంత ధైర్యస్తుడో బయటపడిందా ?

Vijaya
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఏపాటి ధైర్యస్ధుడో తాజా ఉదంతంతో బయటపడింది. రెండు రోజుల క్రితం నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన తర్వాత బహిరంగసభకు ముందు సీఎం మమతాబెనర్జీ గాయపడిన విషయం తెలిసిందే. తనపై నలుగురు దాడిచేసి కారు డోరు వేసేయటం వల్ల తన కాలికి గాయమైందని మమత మండిపడుతున్నారు. తనపై దాడి చేయటానికి బీజేపీ కుట్ర చేసిందంటు మమత తీవ్రంగా ఆరోపించారు. సరే బీజేపీ నేతలు సీఎం ఆరోపణలను ఖండించేశారు. అంతేకాకుండా మమతదంతా ఉత్త డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. సరే మమతపై దాడి జరిగిందా ? బీజేపీ కుట్రచేసిందా ? లేకపోతే మమతే దాడి డ్రామా ఆడుతున్నారా ? అన్న విషయాలు మెల్లిగా బయటపడతాయి.


ఈ మొత్తం ఎపిసోడ్ లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇతర ముఖ్యమంత్రులు, జాతీయ స్ధాయి నేతలు చాలామంది మమతకు స్వయంగా ఫోన్లు చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. కానీ మన చంద్రబాబు మాత్రం కనసం ఫోన్ చేయటానికి కూడా భయపడిపోతున్నారు. తనను తాను జాతీయ అధ్యక్షునిగా చెప్పుకునే చంద్రబాబు దీదీకి ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా ఎందుకింతగా భయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో తమ విజయం కోసం ఇదే మమతను బెంగాల్ నుండి పిలిపించుకుని ప్రచారం చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే అందరు తనకు ఉపయోగపడాలే కానీ తాను మాత్రం ఎవరికీ ఉపయోగపడరని అర్ధమైపోయింది.


అసలు గాయపడిన మమతను పరామర్శించటానికి కూడా చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నట్లు ? ఎందుకంటే నరేంద్రమోడి అంటేనే వణికిపోతున్నారు కాబట్టే. బెంగాల్లో మమత వర్సెస్ మోడి మధ్య ఎన్నికల యుద్ధం ఎంత తీవ్రంగా జరుగుతోందో తెలిసిందే. మరి ఇదే మోడికి దగ్గరవ్వాలని చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మోడిని ప్రసన్నం చేసుకోవటంలో భాగంగానే మోడికి ఇష్టంలేని ఏ పని చేయాలన్నా చంద్రబాబుకు వణుకే. అందుకనే మమతకు కనీసం ఫోన్ చేయటానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు వాడకాన్ని గతంలోనే జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎంత చక్కగా వివరించారో అందరికీ తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ, గుంటూరు జనాలను పట్టుకుని మీలో చేవచచ్చిందా ? మీకు రోషం లేదా ? పౌరుషం లేదా ? అని పదే పదే రెచ్చగొట్టారు. ఇపుడు రోషం, పౌరుషం, చేవ ఎవరిలో చచ్చిందో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: