సెటైర్ : జూమ్ బాబు అంటూ జండూ బామ్ రాసేసిన జగన్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే జరుగుతూ వస్తోంది. కానీ ఇప్పుడు జ ' గన్ ' పెల్చేశారు. చంద్రబాబు ఆ పార్టీ నాయకులను ఆడేసుకునేందుకు సిద్ధమైపోయారు. అన్నట్లుగా సెటైర్లు వేశారు. రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని ఇది వరకే చెప్పామని, ఒకసారి కాదు ఆరు సార్లు చెప్పాము. ఇవన్నీ తెలిసి కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. జగన్ మాట ఇస్తే జరుగుతుంది. చెప్పిన తేదీకి ఇన్ ఫుట్ సబ్సిడీ పడుతుంది. ఇది ఎలాగూ జరుగుతుంది అని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు జూమ్ నొక్కుతాడు. జూమ్ కు దగ్గరగా, భూమికి దూరంగా ఉండే నాయుడు గారు ఆయన అంటూ సెటైర్లు వేశారు.
అక్కడితో ఆగలేదు. పనిలోపనిగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన కూడా సెటైర్లు వేశారు. కానీ వాళ్ల పేర్లు ప్రస్తావించకుండానే పవన్, లోకేష్ ఇద్దరు జూమ్ నాయుడుకు దత్తపుత్రుడిగా జగన్ చెప్పుకొచ్చారు. " జూమ్ నాయుడు తన పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరిని రంగంలోకి దించుతాడు.ఒకరిపైనా నమ్మకం లేదు కాబట్టి , ఇద్దరినీ ఒకేసారి దించుతాడు. సరిగ్గా మనం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామని తెలిసి ఒకరోజు ముందు హైదరాబాద్ నుంచి అంతా దిగుతారు. వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు. రైతుల కష్టాలు వీళ్లకు పట్టవు. గత ప్రభుత్వం లో రైతుల కష్టాలు పడుతుంటే కనీసం నోరుమెదపని పుత్రులు వీళ్లిద్దరు. అంటూ జగన్ తన రాజకీయ ప్రత్యర్థులైన పవన్, చంద్రబాబు, లోకేష్ లపై ఒకే సారి విమర్శలు చేసి, వీళ్ళందర్నీ తిట్టిపోస్తున్న సొంత పార్టీ నాయకులకు మరింత కిక్ ఇచ్చేశాడు జగన్.