సెటైర్ : మారండయ్యా అంటే మారం చేస్తావేంటి తాత ?

అయ్య బాబోయ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుతున్న తరగనంత స్టోరీ ఉంటుంది. అసలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారాన్ని ఏలే స్థాయిలో ఉండాల్సి ఉన్నా, ఆ పార్టీ మాత్రం జనాల్లో లేదు. తెలంగాణ ఇచ్చామన్న సంతృప్తి కూడా ఆ పార్టీకి లేకుండా పూర్తిగా జనాలు పక్కన పెట్టేశారు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను ఉపయోగించుకుని బాగా బలం పెంచుకుంది. అధికారం సాధించింది. అసలు తెలంగాణలో పేరు తప్ప పార్టీ లేదు అని విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ సైతం ఇప్పుడు లైన్ లోకి వచ్చేసింది. బలంగా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. అధికారం సంపాదిద్దాం అనే తొందరలో ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా ఇంకా ఇంకా ఇంకా బలహీన అవుతూనే వస్తోంది .బలం పెంచుకునేందుకు జనాల్లోకి వెళ్లి పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ... ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ... ఇప్పుడు కాకపోతే మరి కొంతకాలానికి అధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అబ్బే అది లేదు.




 పార్టీ అధికారంలో ఉంటే మాకేంటి ? లేకపోతే మాకేంటి మాకు కావాల్సింది వివాదాలు , పార్టీ పదవులు అంతే తప్ప తమకు ఏమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ, ఎప్పుడూ ఉండే గ్రూపు రాజకీయాలకు కుమ్ములాట లకు పాల్పడుతూ ... పార్టీకి ఉన్న కాస్తో కూస్తో పేరును చెడగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ లో జరుగుతున్న లొల్లి జనాలకు సిల్లిగానూ, చీఫ్ గాను కనిపిస్తోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఆ రేవంత్ కో మరొకరితో పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుండగా , అబ్బే ఆ రేవంత్ కు కనుక పదవి ఇస్తే తాను పార్టీలో ఉండను అంటూ... రిటైర్మెంట్ వయసు దాటిపోయి పార్టీకి పెద్దగా ఉపయోగపడని ప్రజల్లో బలం లేని నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చి మరి హడావుడి చేస్తున్నారు. అసలు ఆయన ఉన్న డివిజన్ లోనే సొంతంగా గెలవలేని ఆయన తనకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ మారాం చేస్తున్నాడు. 



వార్ని... ఈ వయసులో పదవులు కావాలా తాత ..? ఇంట్లో కూర్చోక అంటూ సోషల్ మీడియా లోనూ సెటైర్లు పడుతున్నాయి. రేవంత్ బలం ఎంత నీ బలం ఎంత ? నీకు పదవి కావాలా తాత అంటూ పదే పదే సెటైర్లు వేస్తున్నా .. అదంతా నాకు తెల్వధి.. నాకే పదవి షురూ చెయ్యలే...? అంటూ హడావుడి చేసేస్తున్నాడు. అమ్మో ఈ తాత మామూలు తాత కాదు. రాహుల్  గాంధీ నే కాదు రాజీవ్ గాంధీ తోనూ ఫ్రెండ్షిప్ చేసిన తాత.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: