హెరాల్డ్ సెటైర్ : ఓటమికి కారణాలను ఇంతకాలానికి ఒప్పుకున్నాడా ?

Vijaya
‘ఎద్దు ఏడ్చిన వ్యవసాయం..రైతు ఏడ్చిన రాజ్యం నిలవదని పెద్దలు చెబుతారు’ ..ఇది తాజాగా చంద్రబాబునాయుడు నోటినుండి జాలువారిన ఆణిముత్యాలు. ఇంతకాలానికి చంద్రబాబు ఓ సత్యాన్ని బయటపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి చంద్రబాబు ఎంత చెత్తగా పరిపాలన చేసినా అంత ఘోరంగా ఓడిపోవాల్సిన అవసరమైతే లేదు. కానీ ఎందుకంత ఘోరమైన ఓటమి ఎదురయ్యిందనే విషయంలో టీడీపీ సీనియర్ నేతలందరు అప్పటి నుండి జుట్లు పీక్కుంటున్నారు. అలాంటిది మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతు స్వయంగా చంద్రబాబే ఘోరఓమిటికి కారణాన్ని బయటపెట్టారు. ఇంతకీ ఆయన బయటపెట్టిన కారణం ఏమిటయ్యా అంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం...రైతు ఏడ్చిన రాజ్యం నిలవదని.




చంద్రబాబు చెప్పిన కారణాలు రెండు కూడా సరిగ్గా తన పరిపాలనకు బాగా అతికినట్లు సరిపోతుంది. చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగానికి, రైతాంగానికి జరిగిన నష్టం అంతా ఇంకా కాదు. మొదటిసారి ముఖ్యమంత్రయినపుడైతే వ్యవసాయం భారమైపోవటంతో ఎన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో లెక్కేలేదు. వేలాది ఎకరాల పంట పొలాలను రైతులు బీళ్ళుగా వదిలేశారు. బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు తీర్చలేకపోవటంతో బహిరంగంగా రైతుల ఆస్తులను సహకార బ్యాంకులు వేలం వేసిన విషయం అందరికీ తెలిసిందే.  లోన్లు తీసుకుని చేసిన వ్యవసాయం దెబ్బతినటం, తీసుకున్న అప్పులను తీర్చలేకపోవటానికి అదనంగా ఆస్తుల బహిరంగ వేలం. దాంతో పుట్టి పెరిగిన ఊరిలోనే అయినవాళ్ళ ముందు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఎందరో. ఇక 2014లో సీఎం అయిన తర్వాత కూడా రైతులను కొట్టిన దెబ్బ మామూలుది కాదు.




రైతు రుణాలను మాఫీ చేస్తానని, అక్క, చెల్లెళ్ళు వ్యవసాయం కోసం బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారాన్ని విడిపిస్తానని ఇంటి పెద్ద కొడుగ్గా  ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. చంద్రబాబు ఎన్నికల హామీప్రకారం మాఫీ చేయాల్సిన వ్యవసాయ రుణాలు సుమారు రూ. 90 వేల కోట్లు.  అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ. 27 వేల కోట్లకు తగ్గించారు. తగ్గించిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఐదు విడతలుగా చెల్లిస్తానన్నారు. చివరకు మూడు విడతల రుణాలను మాత్రమే మాఫీ చేసి మొత్తం రుణాలన్నీ మాఫీ చేసేసినట్లు ప్రకటించుకున్నారు. ఇక బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం గురించైతే మాట్లాడనే లేదు. ఎవరైనా ప్రస్తావించినా తాను హామీ ఇవ్వలేదని దబాయించారు. వీటిన్నింటికి అదనంగా ఏడాదికి పచ్చని మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలోని వేలాది ఎకరాలను రాజధాని పేరుతో తీసేసుకోవటం. మరిన్నివిధాలుగా రైతులను ఏడిపించారు కాబట్టే టీడీపీ రాజ్యం నిలవలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: