‘సందిగ్ధం’ మూవీ రివ్యూ.. మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే చిత్రం
తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించగా, తెరచేప ఫేమ్ నవీన్ సంకరపు విలన్ పాత్రలో కనిపించారు. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ
అడవులు, కొండల నడుమ ఉన్న ఓ ప్రశాంత గ్రామంలో దేవ్ (నిహాల్), మేఘన (ప్రియా దేశ్‌పాగ్) జీవిస్తూ ఉంటారు. గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ దేవ్ అక్కడ హాస్పిటల్ నిర్మిస్తాడు. ఈ క్రమంలో ఒక రోజు గాయాలతో సత్య (అర్జున్), కళ్యాణి (కాజల్ తివారి) ఆ గ్రామానికి చేరుకుంటారు. వారిని ఆదరించి దేవ్ ఆశ్రయం కల్పిస్తాడు. ఆశ్చర్యకరంగా సత్య, కళ్యాణి గ్రామంలోని ఇతరులకు కనిపించకుండా కేవలం దేవ్‌కి మాత్రమే కనిపిస్తుంటారు.
అసలు ఆ ఇద్దరు ఎవరు? వారి గతం ఏమిటి? దేవ్ జీవితంతో వారికి ఉన్న సంబంధం ఏంటి? వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో సినిమా ముందుకు సాగుతుంది.
ఎలా ఉందంటే
ఫస్ట్ హాఫ్ గ్రామీణ నేపథ్యంలో నెమ్మదిగా కథను పరిచయం చేస్తూ సాగుతుంది. దేవ్ మంచితనం, మేఘనతో ప్రేమ కథ, గ్రామ జీవితం వంటి అంశాలు సహజంగా చూపించారు. సత్య, కళ్యాణి పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో మిస్టరీ పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ అవుతూ థ్రిల్లింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. క్రైమ్, సస్పెన్స్ అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ భాగాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
నటీనటుల పనితీరు
దేవ్ పాత్రలో నిహాల్ మంచి నటన కనబరిచాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. మేఘన పాత్రలో ప్రియా దేశ్‌పాగ్ అందంగా కనిపించడమే కాకుండా పాత్రకు తగ్గట్టుగా నటించింది. అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో సహజమైన నటనతో మెప్పించారు. విలన్‌గా నవీన్ సంకరపు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
సాంకేతిక విభాగం
సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అడవులు, కొండ గ్రామం విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల హృదయాన్ని తాకేలా ఉన్నాయి. దర్శకుడు కథను అనవసర కమర్షియల్ హంగులు లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఫైనల్‌గా
మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో సాగే ‘సందిగ్ధం’ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండే ప్రయత్నం చేసింది. నెమ్మదిగా మొదలై తర్వాత ఆసక్తికర మలుపులతో ముందుకు సాగే ఈ చిత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది.
రేటింగ్ : 3/5