సెటైర్ : చినబాబు కి సీన్ అర్థమైందడోయ్ !

చినబాబు సీన్ పార్టీ ఎంత ఉందో తెలియదు కానీ, ముందు ముందు సీన్ ఎలా ఉంటుందో అర్థం అయిపోయింది. ఇంట్లో కూర్చుని నాలుగు పంచ్ డైలాగులు కొడుతూ, సోషల్ మీడియా లో హడావుడి చేస్తే, ఆ తరువాత అంత సీన్ ఉండదని , జనాలు కూడా సోషల్ మీడియాలో ఓ లైక్ కానీ , ఓ కామెంట్ కాని పెట్టి సరిపెట్టేస్తారని ,ఓట్లు మాత్రం వేరే వేయరు అనే విషయం అర్థం అయిపోయింది. అందుకే తన సీ న్ ఎంత ఉందో చూపించేందుకు చినబాబు
 పగలనక, రాత్రనక తిరిగేస్తూ, తెగ హడావుడి చేసేస్తున్నారు. అసలు పార్టీ బరువు బాధ్యతలను తానొక్కడినే మోస్తున్నానని, కలరింగ్ ఇచ్చేస్తున్నాడు. పార్టీలో సీనియర్ నాయకులను మించిపోయే  విధంగా తానూ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలను అనే  నమ్మకాన్ని కలిగించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.



 తమను పప్పు , నిప్పు అంటూ ఆడిపోసుకోవడం, అసలు మొన్నటి ఎన్నికల్లో తాను పోటీ చేసిన చోట ఓటమి చెందడంతో అందరూ తనకు అంత సీన్ లేదని , తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, ఆ పగ్గాలు మోయలేక చతికిలబడి పోతానని, పార్టీలో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేయడంతో, ఏదో రకంగా తన సీన్ ఎంత ఉందో చూపించాలని, జిల్లాల్లో తిరుగుతూ వాగు వంకల్లో పర్యటిస్తూ, తనకు అలవాటు లేకపోయినా, ట్రాక్టర్ ను నడుపుతూ,  ఇలా ఎన్నో విన్యాసాలు చేసేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు ఎంత సీను ఉందో చూపించేందుకు పెదబాబు సైలెంట్ అయిపోయి, ఇంటికే పరిమితం అయిపోయారు. దీంతో మొత్తం పెదబాబు పాత్రను తీసుకుని జనాలో తిరిగేస్తూ, పనిలో పనిగా ప్రభుత్వాన్ని తిట్టి పోస్తూ, గట్టిగానే హడావుడి చేసేస్తున్నారు. 



ఏదో రకంగా 2024 ఎన్నికల నాటికి తన సత్తా చాటుకుని, పార్టీలోనూ, ప్రజల్లోనూ బలమైన రాజకీయ బాహుబలి గా నిరూపించుకునేందుకు చిన బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే చినబాబు సీన్ మొత్తం పార్టీ తో పాటు , ప్రజలు చూసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: