హెరాల్డ్ సెటైర్ : బెయిల్ రాగానే కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చేసిందా ?
ఏసిబి అధికారులు అచ్చెన్నను ఇంటికి వెళ్ళి మరీ అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. దాంతో చంద్రబాబు దగ్గర నుండి ఎల్లోమీడియా దాకా ఒకటే గోల మొదలుపెట్టేసింది. పైల్స్ ఆపరేషన్ చేసుకున్న అచ్చెన్నపై కనికరం కూడా లేకుండా శ్రీకాకుళం నుండి విజయవాడకు కారులో తెస్తారా ? అంటూ నానా యాగీ చేశారు. ఇదే విషయమై కోర్టులో పిటీషన్ కూడా వేశారు. దాంతో కేసును విచారణ జరిపిన కోర్టు అచ్చెన్నకు వైద్య సౌకర్యాలు అందించమని ఆదేశించింది. దాంతో వైద్య పరీక్షల కోసం అచ్చెన్నను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిరోజులు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న అచ్చెన్నను తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఎప్పుడైతే జ్యుడిషీయల్ రిమాండ్ కు తరలించారో వెంటనే అచ్చెన్న అనారోగ్యం తిరగబెట్టింది.
ప్రభుత్వాసుపత్రిలో తనకు సరైన వైద్యం అందటం లేదు కాబట్టి కార్పొరేటు ఆసుపత్రిలో చేరుతానని అచ్చెన్న కోర్టులో కేసు వేశాడు. దాన్ని విచారించిన కోర్టు అచ్చెన్న కోరికను మన్నించింది. వెంటనే అచ్చెన్న డాక్టర్ రమేష్ బాబు ఆసుపత్రిలో చేరిపోయాడు. రమేష్ ఆసుపత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం వివాదంలో కీలకమైన పోతినేని రమేష్ దే. ఎప్పుడైతే అచ్చెన్న రమేష్ ఆసుత్రిలో చేరాడో అప్పటి నుండి హ్యాపీనే. అచ్చెన్నను కలవటానికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో ఆసుపత్రి చాలా సందడిగా మారిపోయిందట. రమేష్ ఆసుపత్రిలో అచ్చెన్న ఆరోగ్యం కుదుటపడిందని, కాబట్టి మళ్ళీ తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. ఈ విషయం కోర్టు విచారణలో ఉండగానే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి. ఇంకేముంది చేసేది లేక పోలీసులు కూడా వెనక్కు తగ్గినట్లున్నారు.