హెరాల్డ్ సెటైర్ : వైఎస్సార్సీపీ పేరుపై  ఎల్లోమీడియా బాధేంటో అర్ధం కావటం లేదే ?

Vijaya
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుమీద, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బొమ్మవాడటం మీద కోర్టులో కేసు ఏమవుతుంది ?  ఇక్కడ పార్టీ పేరు ముఖ్యమా ? లేకపోతే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమా ? వాస్తవంగా చూస్తే పార్టీ పేరుకన్నా అధినేతే ముఖ్యమన్న విషయం అందరికీ తెలుసు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డే ముఖ్యం కాబట్టి పార్టీ పేరు పోయినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ ఇంతచిన్న లాజిక్ ను మిస్సవుతున్న ఎల్లోమీడియా మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు, వైఎస్సార్ బొమ్మపై కోర్టులో కేసు వేయగానే తొందరలోనే జగన్ ప్రభుత్వం కూలిపోతుందనేంతగా హడావుడి చేసేస్తోంది.

జగన్ ను దెబ్బ కొట్టడానికి చంద్రబాబు+టిడిపి నేతలు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. వీళ్ళకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా నెగిటివ్ వార్తలు, కథనాలు అచ్చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాదు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా జగన్ను దెబ్బ కొట్టడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. పరిస్ధితి ఎలా తయారైందంటే జగన్ తో పోరాటం చేయలేకపోతున్నారు. అలాగని పోరాటం ఆపే పరిస్ధితిలో లేరు. అందుకనే ఏ చిన్న అవకాశం వచ్చినా ఉపయోగించుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసు వివాదాస్పదమైంది. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచానే కానీ వైఎస్సార్సీపీ గుర్తుపై కాదనే పిచ్చి వాదనను ఎంపి లేవదీశాడు. పనిలో పనిగా ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ దగ్గర కూడా ఫిర్యాదు చేశాడు.

ఇంకేముంది వెంటనే గతంలో ఎప్పుడో అన్న వైఎస్సార్సీపి పేరుతో పార్టీని రిజస్టర్ చేసుకున్న మహబూబ్ భాషాను కొందరు రంగంలోకి దింపేశారు. భాషాను రంగంలోకి దింపిందెవరనే విషయాన్ని కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు.  భాషాతో ఎన్నికల కమీషన్ కు జగన్ పై ఫిర్యాదు చేయించటమే కాకుండా ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా వేయించారు. కోర్టు నోటీసులివ్వగానే ఇంకేముంది వైఎస్సార్సీపీ పార్టీ భవిష్యత్ కతం అన్నట్లుగా కథనాలు వండి వారుస్తున్నారు. ఎంపికి షోకాజ్ నోటీసిస్తే అసలు పార్టీ మనుగడకే ముప్పు వచ్చిందంటూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు.

ఇక్కడ ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఒకటుంది. ఎన్నికల కమీషన్ దగ్గర పార్టీని రిజస్టర్ చేసే సమయంలోనే పార్టీ పేరు, పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తు లాంటివి దరఖాస్తులో  చెప్పాలి. దరఖాస్తును పరిశీలించిన కమీషన్ పార్టీ పేరు, చిహ్నం, ఎన్నికల గుర్తు అంతకుముందే ఎవరైనా రిజస్టర్ చేసుకుని ఉంటారా ? అని చూస్తుంది. అప్పటికే ఎవరూ పేరు, చిహ్నం, ఎన్నికల గుర్తును ఎవరు రిజస్టర్ చేసుకోలేదని నిర్ధారించుకున్నాకే తాజాగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు అవన్నీ కేటాయిస్తుంది. ఈ పద్దతిలోనే జగన్ కు వైఎస్సార్సీపీ పేరు, చిహ్నమైన ఫ్యాన్ ను ఎన్నికల కమీషన్ ఓకే చెప్పింది. అంతకుముందే ’అన్న వైఎస్సార్సీపీ’ పేరు రిజస్టర్ అయిన విషయాన్ని ఎన్నికల కమీషన్ గమనించింది. తెలిసే జగన్ పార్టీ పేరును ’వైఎస్సార్సీపీ’ గా పార్టీ గుర్తును ఫ్యాన్ గా ఖారారు చేసింది.   

కాస్త లాజికల్ గా ఆలోచించే వాళ్ళకు ఈ విషయాలన్నీ అర్ధమవుతాయి. గుడ్డిగా జగన్ పై వ్యతిరేకత పెంచేసుకున్న వాళ్ళని ఎవరు మార్చలేరు. మహబూబ్ భాష కానీ లేకపోతే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్న మాటలన్నీ కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికివస్తుంది.  వాళ్ళ మాటలనే ఎల్లోమీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తు ఆనందం పొందుతోంది. నిజానికి ’అన్న వైఎస్సార్సీపీ’కి ’వైఎస్సార్సీపీ’కి చాలా తేడావుంది. మహబూబ్ భాష్ ఫిర్యాదును ఎన్నికల కమీషన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

అలాగే ఢిల్లీ హైకోర్టు కూడా పిటీషన్ను అడ్మిట్ చేసుకోకుండానే డిస్మిస్ చేసేయొచ్చు. మరి ఎందుకని పిటీషన్ను ఎంటర్ టైన్ చేస్తున్నాయో ఎవరికీ అర్ధం కావటం లేదని వైసిపి నేతలంటున్నారు. అసలు పార్టీ పేరులో ఏముంది ?  ఏ పార్టీకి జగన్ అధినేతగా ఉంటాడో జనాలు ఆపార్టీకే ఓట్లేస్తారు కానీ మహబూబ్ భాషా నేతృత్వంలోని అన్న వైఎస్సార్సీపీకి అయితే ఓట్లు వేయరు కదా ?  మరి ఇంతోటిదానికి జగన్ పనైపోయిందనేట్లుగా ఎల్లోమీడియా ఎందుకింతగా రెచ్చిపోతోందో అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: