హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు పరువు తీసేసిన సంచైత.. సమాధానం చెప్పగలడా ?

Vijaya
’సుప్రింకోర్టు తీర్పును ఏపి ప్రభుత్వం గ్రహించాలి’ .. ఇది తాజాగా చంద్రబాబునాయుడు పలికిన పలుకులు. కేరళలో పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యతను ట్రావెన్ కోర్ సంస్ధానంకే అప్పగించాలంటూ తాజాగా సుప్రింకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పునే చంద్రబాబు ప్రస్తావించాడు. ట్రస్టుల నిర్వహణలో సంప్రదాయాలు, పవిత్రతను ధర్మాసనం పరిరక్షిందంటూ చంద్రబాబు చెప్పటం వరకు ఓకేనే. సుప్రింకోర్టు తీర్పును ఏపి ప్రభుత్వం గ్రహించి సింహాచలం, మన్సాస్ ట్రస్టు నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదంటూ హితవు పలకటమే విచిత్రంగా ఉంది. తాను అధికారంలో ఉన్నపుడు ప్రతి ట్రస్టు విషయంలోను జోక్యం చేసుకుని వాటిని భ్రష్టపట్టించిన ఘనమైన చరిత్ర చంద్రబాబు సొంతమని అందరికీ తెలిసిందే.

ఇపుడు మన్సాస్ ట్రస్టు విషయంలో జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకున్న మాట వాస్తవమే. అయితే ఎందుకు జోక్యం చేసుకుంది ? ఎందుకంటే గజపతిరాజుల వారసురాలు సంచయితా గజపతిరాజు ట్రస్టులో జరుగుతున్న అధికార దుర్వినియోగం, అవకతవకలపై ఫిర్యాదు చేసింది. తన బాబాయ్ అశోక్ గజపతిరాజు నేతృత్వంలో  ట్రస్టు వ్యవహారాలు భ్రష్టుపట్టిపోయిదంటూ ఫిర్యాదు చేయటం వల్లే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సొచ్చింది. ప్రాధమిక విచారణలో ఫిర్యాదు వాస్తవమని తేలిన తర్వాత అర్ధాంతరంగా అశోక్ నేతృత్వంలోని ట్రస్టుబోర్డును రద్దు చేసి కొత్తగా ట్రస్టుబోర్డును ఏర్పాటు చేసింది.

మన్సాస్ ట్రస్టుకు ప్రభుత్వం కొత్తగా బోర్డును ఏర్పాటు చేసిందే కానీ దానిపై ప్రభుత్వ ఆజమాయిషీని పెట్టలేదు. అదికూడా మళ్ళీ గజపతిరాజుల వారసులను ఛైర్మన్ గా నియిమించిందే కానీ వైసిపి నేతనో లేకపోతే ఐఏఎస్ అధికారినో నియమించలేదు. కాబట్టి చంద్రబాబు సలహా జగన్ ప్రభుత్వానికి సూటవ్వదు. నిజం చెప్పాలంటే మన్సాస్ ట్రస్టు వ్యవహారాలు  అశోక్ , చంద్రబాబు హయాంలోనే గబ్బుపట్టినట్లు సంచియితా గజపతిరాజు మండిపోతోంది. చంద్రబాబు హయాంలో గజపతి రాజుల వారసురాలు సంచియితకు చంద్రబాబు ట్రస్టులో చోటు కల్పించలేదు. దీంతోనే ట్రస్టు వ్యవహారాల్లో చంద్రబాబు ఏ స్ధాయిలో జోక్యం చేసుకున్నాడో అర్ధమైపోతోంది. తనకు నమ్మకస్తుడైన ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీయార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఐవి రావును చంద్రబాబు బోర్డులో నియమించాడు. మరి ఆనందగజపతిరాజు కూతురైన సంచయితను ఎందుకు బోర్డులో నియమించలేదు ?

ఇదే విషయమై సంచయిత చంద్రబాబును నిలదీస్తోంది ఇపుడు. వైసిపి ప్రభుత్వం సంచియితను ఛైర్మన్ గా నియమించటంతో పాటు అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజుతో పాటు ఇదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురిని కూడా ట్రస్టుబోర్డులో నియమించింది. ఏరకంగా చూసినా ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నది చంద్రబాబే కానీ జగన్ ప్రభుత్వం కాదని అర్ధమైపోతోంది. అశోక్, చంద్రబాబు కలిసి ట్రస్టును ఏ విధంగా సొంతానికి వాడుకున్నారనే విషయంలో సంచియిత చేసిన ఆరోపణలకు ఇద్దరూ ఇంతవరకూ సమాధానం కూడా చెప్పలేదు. కాకపోతే అలవాటైన ప్రాణం కాబట్టి జగన్ పై ఏదో ఒకటి ఆరోపణ చేయటమో బురద చల్లటమే చేస్తే కానీ చంద్రబాబు రోజు గడచినట్లు కాదంతే.

గడచిన ఏడాదిగా జగన్ ప్రభుత్వంపై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు కాబట్టే జనాల ముందు చంద్రబాబు పలుచనైపోతున్నాడు. పనిలో పనిగా 15 రోజుల్లో 2 దుర్ఘటనలు, 3 కంపెనీల్లో వైజాగ్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఏడుపొకటి. ఎల్జీ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాదం జరగ్గానే బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు చెప్పటిన విషయం మరచిపోయాడేమో. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారంగా కోటి రూపాయలు అందించిన విషయం చంద్రబాబు మరిచిపోయాడా ? మొత్తానికి గోల చేయటమే టార్గెట్ గా పెట్టుకుని అయినదానికి కానిదానికి రచ్చ చేస్తే జనాలు పట్టించుకోరన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: