హెరాల్డ్ సెటైర్  : ఆ సినిమాలో చెప్పినట్లే టిడిపిలో జరుగుతోందా ? .. వాటే కో ఇన్స్ డెన్స్ ?

Vijaya
’నేచర్లో ఎప్పుడో జరిగిన ఓ మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ ను డిసైడ్ చేస్తుందా’ ? అవును మీరు ఊహించింది కరెక్టే. ఇది ఓ సినిమాలో డైలాగే. కాకపోతే ఇపుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కూడా సరిగ్గా వర్తిస్తుందన్న విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సరిగ్గా సినిమాలో చెప్పినట్లు జరుగుతుండటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఏమన్నాడో, ఏమి చేశాడో సరిగ్గా అవే ఇపుడు రివర్సులో ఫార్టీ ఇయర్స్ కు ఎదురు తగులుతున్నాయి.  

ఇంతకీ విషయం ఏమిటంటే 2014-19 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను  ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపునే గెలిచింది కూడా సరిగ్గా 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలే కావటం విచిత్రమే. అలాగే ఒకపుడు మోడిని ఏపిలోకి రానిచ్చేది లేదని హూంకరించాడు. కాలం గిర్రున తిరిగేటప్పటికి  ఏపిలోకి అడుగు పెట్టటానికి అనుమతి కోరుతూ తానే మోడికి లేఖ రాయాల్సొచ్చింది.

అప్పట్లో అసెంబ్లీ జరిగినంత కాలం మంత్రి పదవిలో ఉన్న అచ్చెన్నాయుడు సందర్భం ఏదైనా కానీండి ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి బోనులో నిలబడుతున్నాడంటూ జగన్మోహన్ రెడ్డిని వందలసార్లు ఎగతాళి చేశాడు. చివరకు తాను కూడా శుక్రవారమే కోర్టులో నిలబడాల్సొచ్చింది. జగన్ గారు ఎప్పటికీ సిఎం కాలేడంటూ చినబాబు నారా లోకేష్ ఎన్నిసార్లు ఎద్దేవా చేశాడో అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరిలో పోటి చేసిన లోకేష్ బాబే ఓడిపోవటాన్ని విధి లిఖితమని అనాలా ?

పాదయాత్రలో భాగంగా జగన్ రాజధాని అమరావతిలో పర్యటించాడు. తమ గ్రామాల్లో జగన్ పాదయాత్ర చేసినందకు అపవిత్రమైపోయిందని, మైల పడిందంటూ స్ధానిక టిడిపి జనాలు గ్రామాల్లోని రోడ్లను పసుపు నీళ్ళతో శుద్ధి చేసిన విషయం అందరూ చూసిందే. సీన్ కట్ చేస్తే తమ న్యాయం చేయాలంటు ఇదే రాజధాని గ్రామాల్లోని జనాలు  జగన్ ను బతిమలాడుకుంటున్నారు. ఇఎస్ఐ లో వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అచ్చెన్న అదే ఇఎస్ఐ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవటం.

అచ్చెన్నకు ఆపరేషన్ జరిగిందని కూడా చూడకుండా పోలీసులు అరెస్టులు చేయటమేంటని చంద్రబాబు నానా యాగీ చేస్తున్నాడు. మరి వైసిపిలో ఉన్నపుడు దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డిని పోలీసులతో ఎలా అరెస్టు చేయించాడో గుర్తుకు రావటం లేదా ?  అప్పట్లో భూమా కూడా గుండె ఆపరేషన్ చేయించుకున్న సమయంలోనే కదా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు క్రింద అరెస్టు చేసింది.

ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా వైజాగ్ వెళ్ళిన జగన్ను అప్పట్లో చంద్రబాబు ఎయిర్ పోర్టులో నుండి బయటకు రానీయలేదు. తాజాగా చంద్రబాబు కూడా విశాఖపట్నం వెళ్ళినా బయటకు వెళ్ళలేక చివరకు వెనక్కు తిరగాల్సొచ్చింది. ఇటువంటివే ఇంకా ఎన్ననైనా ఉండొచ్చు. మొత్తానికి పైన చెప్పుకున్న సినిమా డైలాగుకు బయట జరుగుతున్న వాటికి సరిగ్గా సరిపోతోంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: