హెరాల్డ్ సెటైర్ : పవన్ కు ఇప్పుడే తెల్లారిందా ?  ఎలాగైపోయాడో ?

Vijaya
’గ్యాస్ బాధితులకు న్యాయం చేయకుంటే ఉద్యమాలు చేస్తాం’ ... ఇవి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు. పార్టీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్సులో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలే విచిత్రంగా ఉంది. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగి ఇప్పటికి 10 రోజులైంది. ప్రమాదం జరగ్గానే యావత్ జిల్లా యాంత్రాంగమంతా ఘటనా స్ధలానికి వెళ్ళి సహాయ చర్యలు చేసిన విషయం అందరూ చూసిందే. ప్రభుత్వం స్పందించిన విషయంపై టిడిపి ఎంఎల్ఏ గణబాబు కూడా అభినందించారు.

గ్యాస్ ప్రమాదంలో మరణించిన వారికి తలా కోటి రూపాయలు బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో వేసింది ప్రభుత్వం. ప్రమాదం జరిగిన మధ్యాహ్నమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆసుపత్రుల్లో ఉన్న బాధితులను పరామర్శించిన విషయం అందరూ చూసిందే. తర్వాత కూడా వివిధ స్ధాయిల్లో చికిత్సలు చేయించుకున్న వారికి కూడా నష్టపరిహారం ఇచ్చేసింది. అలాగే గ్రామాల్లో కూడా ఇప్పటికీ ప్రభుత్వం సహాయ చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ పెట్టి వైద్య పరీక్షలు చేయిస్తోంది.

ఇవన్నీ పవన్ కళ్ళకు కనబడలేదా ? అని ఆశ్చర్యంగా ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటే బాధితులకు సహాయ చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని బెదిరించటం పవన్  కే చెల్లింది. పైగా సోమవారమే మరణించిన వారి కుటుంబాలతో జగన్ వీడియా కాన్ఫరెన్సులో మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చిన విషయం బహుశా పవన్ కు తెలీదేమో. 10 రోజుల క్రితం జరిగిన ఘటనపై ఇపుడు స్పందించాడంటేనే పవన్ ఎంత స్పీడుగా ఉన్నాడో అర్ధమైపోతోంది.

ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల విషయంలో జగన్ స్పందించిన తీరుతో ఏమి మాట్లాడాలో ప్రతిపక్ష నేతలకు అర్ధం కాలేదు. దాంతో రెండు మూడు రోజులు ఏమీ మాట్లాడలేకపోయారు. కాకపోతే రాజకీయంగా ఏదో యాగీ చేయాలి కాబట్టి చంద్రబాబు మళ్ళీ గోల మొదలుపెట్టాడు. బహుశా చంద్రబాబు నుండి డైరెక్షన్ రావటం లేటైందేమో. అందుకనే ఇంత ఆలస్యంగా పవన్ స్పందించాడు.  రెండు రోజులు వరసగా జనాల్లో కనబడితే మళ్ళీ నెల రోజులు అడ్రస్ కనబడని పవన్ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాటాలు చేయాలని పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: