హెరాల్డ్ సెటైర్ : అన్నీ ఆర్పేసి .... ఇప్పుడు కొవ్వొత్తి ఆర్పడం ఏంటయ్యా ...?
ఈ రోజు చాలా గొప్ప రోజు ... ఓ మహానుభావుడి పుట్టిన రోజు ! అబ్బబ్బ ఇది నిజంగానే పండుగరోజు ...! వాళ్లంతా పసుపు పూసుకుని రోడ్ల మీద dj సౌండ్లు పెట్టుకుని మరీ డాన్స్ చేద్దాం అంటే ఈ కరోనా వచ్చి పడింది. అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియడం లేదు. మా సినబాబు ఇప్పడు ఇప్పుడే రోడ్ల మీదకు వచ్చి' సైకిల్' తొక్కడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతేనా తనలా తన కొడుక్కి ఈ పరిస్థితి రాకూడదని ఇప్పటి నుంచే బుజ్జి బాబు కి కూడా ప్రాక్టీస్ ఇచ్చే పనిలో పడ్డాడు. అసలు సెంద్రాల సారూకి ఎవరైనా పుట్టిన రోజు చెప్పారో లేదో. అసలే ఈ రోజు 4 / 20 . మా సెంద్రాల సారు పుట్టిన గొప్ప రోజు. అబ్బబ్బ ఎన్నెన్ని గొప్ప గొప్ప పనులు చేసాడో కదా..! అసలు అలంటి సారు పుట్టిన రోజు అంటే ఆషామాషీనా ...! యుగపురుషుడు ... కథానాయకుడు ... మహా నాయకుడు అన్నీ ఆయనే కదా ! అబ్బా గొప్పగా చేసెయ్యాలిగా పుట్టిన రోజు.
అసలు ఈ లాక్ డౌన్ లోనూ మా సేంద్రాల సారు పుట్టిన రోజు బాగానే జరుపుకున్నాడు ... కొవ్వొత్తి ఆర్పేశాడు. అసలు ఆర్పడం అంటే మా బాబొరికి మా సరదా ! ఓస్ ... తుస్ బుస్ కొవ్వొత్తి ఎవడికి కావాలి ..! అసలు మా బాబోరు ఆర్పిన లిస్ట్ చూస్తే ఎవడికైనా మతి గీతి పోవాల్సిందే. ఏంటేంటి ..? రామారావు జీవితాన్ని ఆర్పాడు, రైతుల జీవితాన్ని ఆర్పాడు, రాష్ట్ర ప్రజల జీవితాలను ఆర్పాడు, తెలుగు జాతిని ఆర్పాడు, ఈరోజు కొత్తగా ఆర్పటానికి ఏముంది కొవ్వొత్తి తప్ప అని మా బాబొరినే ఆడిపోసుకుంటారా...? మీకెంత ధైర్యం ..? అసలు ఆయన గొప్పదనం తెలుసా ఎవడికైనా ...? తెలిస్తే మీరు అలా మాట్లాడతారా ...?
బ్రిటిషోళ్ళతో పోరాడాడు... ! ప్రకృతినే హ్యాండిల్ చేసాడు..! సముద్రాన్ని కంట్రోల్ చేసిపడేశాడు. అసలు ఆయన్ను పెధానిమంత్రి సేయకుండా.. కనీసం ముఖ్యమంత్రి అవ్వకుండా ఈ జనాలు ఎంత పెద్ద తప్పు చేశారు..? అసలు కరోనా రావడానికి కారణం ఇలాంటి పాపాలు చేయడమే కదా ...? ఏపీ జనాలు చేసిన పాపానికి ఇప్పుడు పెపంచకం అంతా అనుభవిస్తున్నారు కదా ...? అసలు ఇలాంటి పెను విపత్తులు రావడానికి కారణం ఇదే కదా ? అసలు బాబొరి పాలనలో ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేశారు... అసలు మొన్నే గెలిపించి ఉంటే... ఈ పాటికి మా సినబాబోరు ఛీయం అయ్యేవారు కదా ! మనల్ని ఇంకా ఉద్దరించేవారు కదా ..? అవన్నీ చేయడం మానేసి ఇప్పుడు మా బాబోరు సాదాసీదాగా కొవొత్తులు ఆర్పుతున్నారు.... ఏయ్ ఎవడ్రా అది మా బాబోరు ఎన్నో కొంపలు ఆర్పేసి ఇప్పడూ తీరిగ్గా కొవ్వొత్తులు ఆర్పుతున్నారు అంటారా ...? అయ్యో అయ్యయ్యో..! అయినా ఎన్నో ఆర్పిన మీరు చీపుగా .... ఈ కొవ్వొత్తులు ఆర్పడం ఏంటయ్యా...?