ఎర్రిపు : ఎవడిడప్పు వాడు కొట్టండహే..!

shami

సినిమా తీయడమే కాదు ఆ సినిమాకు తగినట్టుగా ప్రమోట్ చేయడం కూడా సినిమాలో భాగమవుతుంది. స్టార్ సినిమా విషయంలో ఈ ప్రమోషన్స్ కాస్త క్రేజీగా ఉంటాయి. మేము తీసిందో అద్భుతమైన సినిమా.. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కథ ఇంతవరకు తెలుగులో రాలేదు. కథ కోసమే చాలా వర్క్ అవుట్ చేశాం ఇలాంటివన్ని సాధారణంగా మనం స్టార్ హీరో సినిమాల వేడుకల్లో వినే మాటలే. అయితే తీరా సినిమా చూస్తే అందులో వీళ్లు ఇచ్చిన బిల్డప్ అంత సీన్ ఏముండదు. 

 

ఇక టీజర్ దగ్గర నుండి సినిమా వసూళ్ల లెక్కల దాకా రికార్డుల గురించి ఒకటే రచ్చ చేస్తారు. టీజర్, ట్రైలర్ రికార్డులంటే అవి కనిపించే వ్యూస్ కాబట్టి నమ్మేయొచ్చు కాని కనిపించకుండా వినిపించే ఈ కలక్షన్స్ లెక్క గురించే ప్రతి ఒక్క ఆడియెన్ కు డౌట్. సినిమా రిలీజై మూడు రోజులు కాగానే 100 కోట్ల పోస్టర్, ఆ తర్వాత 150, 200 కోట్ల పోస్టర్స్ ఇలా పుట్టుకొస్తాయి. స్టార్ హీరోల కలక్షన్స్ రికార్డుల కోసం ఫేక్ కలక్షన్స్ రిపోర్ట్ ఇస్తుంటారు. ఫలానా హీరో అని కాదుకాని మా సినిమా ఇన్ని కోట్లు వసూళు చేసింది.. ఇంకా మీరు చూడలేదా అన్నట్టుగా ఆడియెన్స్ పై వసూళ్ల లెక్క రుద్దుతారు.

 

ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వందల కోట్లు పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. అయితే బజ్ బాగుండి కలక్షన్స్ బాగున్నా సరే పోస్టర్స్ చూస్తే మాత్రం నమ్మట్లేదు. ఈమధ్య రిలీజైన సినిమాల విషయంలో కూడా ప్రస్తుతం ఈ కలక్షన్స్ గోల తెలిసిందే. మా సినిమా 100 కోట్లని ఒకరంటే మా సినిమా 120 కోట్లంటూ రిలీజ్ కోసమే కాదు రికార్డుల కోసం కూడా గొడవ పడుతున్నారు. అసలు లెక్క ఏంటన్నది ప్రేక్షకులకు తెలిసే వరకు వీళ్లవి అన్ని ఫేక్ కలక్షన్స్.. ఫేక్ రికార్డులే అనుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: