జట్టుకు అవసరమైనప్పుడు.. ఎప్పుడు రోహిత్ ఆడలేదు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. అయితే ఈ ఛాంపియన్ టీం కి గత ఏడాది లాగానే 2023 ఐపీఎల్ సీజన్లో కూడా నిరాశే ఎదురు అయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇక ఐపీఎల్ ప్రారంభంలోనే తడబడింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇక అదృష్టం కూడా కలిసి రావడంతో నెగెటివ్ రేటింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా అటు ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకోగలిగింది.

 దీంతో ముంబై ఇండియన్స్ అటు టైటిల్ గెలుస్తుందేమో  అనే ఆశ అందరిలో చిగురించింది. ఇలాంటి సమయంలోనే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్ అటు క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ చేతిలో మాత్రం ఓడిపోయింది అని చెప్పాలి. ఏకంగా 62 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూసింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 8 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ బ్యాటింగ్ తీరుపై మ్యాథ్యూ హెడెన్ స్పందిస్తూ విమర్శలకు గుప్పించాడు.

 అటు టీమిండియాలో అయినా ఇటు ఐపీఎల్లో అయినా జట్టుకు అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఆడటం మాత్రం తాను ఇంతవరకు చూడలేదని మాథ్యూ హెడెన్  వ్యాఖ్యానించాడు. పేరుకు మాత్రమే రోహిత్ స్టార్ బ్యాట్స్మెన్ అని విమర్శలు గుప్పించాడు. అయితే ఈయన వ్యాఖ్యలతో అటు ఎంతో మంది భారత ప్రేక్షకులు ఏకీభవిస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే టీంకు అవసరమైనప్పుడల్లా రోహిత్ శర్మ విఫలం అవుతూనే ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్ లో ఐదు సెంచరీలతో చెలరేగిపోయిన రోహిత్ శర్మ న్యూజిలాండ్తో కీలకమైన సెమీఫైనల్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 2021 టీ20 ప్రపంచ కప్ లోను పాకిస్తాన్ తో జరిగిన ఆరంభ మ్యాచ్లో డక్ అవుట్ అయ్యాడు. 2022 టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తోను చేతులెత్తేసాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ తో జరిగిన కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఇక 2022 ఆసియా కప్, 2021 డబ్ల్యూటీసి ఫైనల్ లోను రోహిత్ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: