ధోనిని పక్కన పెట్టిన సురేష్ రైనా.. షాకవుతున్న ఫ్యాన్స్?

praveen
ఎన్నో రోజుల నుంచి క్రికెట్ లవర్స్ అందరికీ అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. ప్రస్తుతం క్లైమాక్స్ కి చేరుకుంది అన్న విషయం తెలిసిందే.. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో విజయం సాధించిన చెన్నై ఫైనల్ లో అడుగుపెట్టింది. అయితే ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయిన గుజరాత్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో మాత్రం ముంబై ఇండియన్స్ పై ఘన విజయాన్ని సాధించి.. మళ్లీ ఫైనల్ లో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే మొదటి క్వాలిఫైయర్ లో పోటీపడిన గుజరాత్, చెన్నై మధ్య ఇప్పుడు ఫైనల్ లో కూడా మళ్లీ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

 ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ కు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు 2023 ఐపీఎల్ సీజన్లో బెస్ట్ టీం ఏది అనే విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా సైతం ఈ విషయంపై స్పందిస్తూ 2023 ఐపీఎల్ లో తన బెస్ట్ టీం ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో అటు కెప్టెన్ ధోని కి మాత్రం ఛాన్స్ ఇవ్వకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

 సురేష్ రైనా ధోనీకి ఆప్త మిత్రుడు. అలాంటి రైనా ధోనీకి తన జట్టులో ఎందుకు చోటు ఇవ్వలేదని అందరూ చర్చించుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని తన ప్లేయింగ్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్ గా.. లక్నో ప్లేయర్ నికోలస్ పూరన్ ని వికెట్ కీపర్ గా ఎంచుకున్నాడు. ఇక ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, గిల్ లను ఎంచుకున్న రైనా.. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ ల్ తో టాప్ ఆర్డర్ ని ఎంచుకున్నాడు. ఇక రవీంద్ర జడేజా తో పాటు మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ చాహాల్ ను బౌలర్లుగా ఎంచుకున్నా రైనా సబ్స్టిట్యూట్ ప్లేయర్లుగా కామరూన్ గ్రీన్, రుతురాజు గైక్వాడ్, జితేష్ శర్మ, పతిరాన, యష్ ఠాగూర్ లను ఎంచుకున్నాడు. అయితే ధోనీకి ప్లేయింగ్ ఎలివేన్ లోనే కాదు కనీసం సబ్స్టిట్యూట్  ప్లేయర్ గా కూడా చోటు ఇవ్వలేదు రైనా. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. రైనా ఇలా ఎందుకు చేశాడో అని చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: