వాళ్లపై ఎక్కువ డిపెండ్ అవ్వడమే.. లక్నో కొంప ముంచింది : మాజీ క్రికెటర్

praveen
గత ఏడాది ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గత ఏడాది మంచి ప్రదర్శన చేసి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన లక్నో టీం.. ప్లే ఆఫ్ లోనే చివరికి ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. అయితే 2023 ఐపీఎల్ సీజన్లోనూ లక్నో టీం కి ఇలాంటి పరాభవమే ఎదురయింది. మొదటి నుంచి మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన లక్నో జట్టును ఒకవైపు గాయాల బెడద వేధించింది. అయినప్పటికీ జట్టు సమిష్టిగా రాణించి ఇక ప్రత్యర్థి పై విజయాలు సాధిస్తూ అటు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.

 కానీ గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్ లో లక్నో జట్టును దురదృష్టం వెంటాడింది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ చేతిలో ప్లే ఆఫ్ లో ఏకంగా 81 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది లక్నో జట్టు. కనీసం ఫైనల్ వరకు అయినా వెళ్తుందా అనుకుంటే అది జరగలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లక్నో ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ప్రస్తుతం భారత క్రికెట్ లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఇక ఇటీవల ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీద ఆధారపడటం కారణంగానే ఇలాంటి పరాభవాన్ని చవి చూసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ డిపెండ్ అవ్వడం ఆ జట్టు కొంపముంచింది అంటూ మురళి విజయ్ అభిప్రాయపడ్డాడు. ఇక అదే సమయంలో దీపక్ హుడా కృనాల్ పాండ్యా లాంటి దేశీయ ఆటగాళ్లు కూడా కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడం జట్టు విజయాలపై ఎంతగానో ప్రభావం చూపింది అంటూ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ లలో 8 మ్యాచ్లలో విజయం సాధించిన లక్నో టాప్ 3 లో నిలిచి ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరం కావడంతో కృణాల పాండ్య సారధ్య బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: