ఫైనల్ కు వెళ్లడంలో.. చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డ్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెబుతూ ఉంటారు. అయితే ముంబై ఇండియన్స్ తో పోల్చి చూస్తే అటు చెన్నై సూపర్ కింగ్స్ ఒకసారి తక్కువగానే టైటిల్ విజేతగా నిలిచింది. కానీ టైటిల్ విజేతగా నిలిచిన విషయం పక్కన పెడితే.. మిగతా గణాంకాలు మాత్రం ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఉన్నాయి అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ప్రతిసారి కూడా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది అనడంలో సందేహం లేదు. అంతేకాదు ఎక్కువ సార్లు ఫైనల్ కు వెళ్లిన టీం గా కూడా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతోంది.

 మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ఆ జట్టు సాధించిన రికార్డులు చూస్తే అర్థమవుతుంది అని చెప్పాలి. అయితే జట్టులో ఎంతో మంది ఆటగాళ్లు వస్తూపోతూ ఉన్నప్పటికీ ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం మాత్రం ఒకే విధంగా సాగుతూ వస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్లోనూ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన చెన్నై జట్టు.. ఫైనల్ లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. 2023 ఐపీఎల్ సీజన్తో కలిపి మొత్తం 14 సీజన్లలో పది సార్లు ఫైనల్ కు వెళ్ళింది చెన్నై సూపర్ కింగ్స్. దీన్ని బట్టి ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక 14 సీజన్లలో నాలుగు సార్లు ఛాంపియన్గా.. అత్యధికంగా 12సార్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ గణాంకాలు ఐపిఎల్ లో ఉన్న ఏ జట్టుకు సాధ్యం కాలేదు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: