వెరీ కాస్లీ.. ఒక్క పరుగు విలువ.. రూ.కోటి పైనే?

praveen
ఐపీఎల్ లో ఉండే కొన్ని రూల్స్ అటు ఆటగాళ్లకు బాగా లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే . ఐపీఎల్లో ఆటగాడు ఒక్క మ్యాచ్ ఆడిన కూడా అతన్ని జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీ  కేటాయించిన మొత్తాన్ని కూడా అతనికి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ రూల్ అటు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ బెన్ స్టోక్స్  కి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా రికార్డు స్థాయి ధరతో అతను జట్టులోకి తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. 16.25 కోట్లు పెట్టి వేలంలో అతన్ని కొనుగోలు చేసింది అని చెప్పాలి.

 ఇలా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బెన్ స్టోక్స్ కోసం వెచ్చించిన మొత్తం ఏకంగా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెల్లిస్తున్న వేతనం కంటే ఎక్కువే అని చెప్పాలి. కానీ ఇంత భారీ ధర పలికిన బెన్ స్టోక్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కు ఎక్కడ ఉపయోగపడలేదు. ఈ ఏడాది  ఐపిఎల్ సీజన్లో అతను కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ రెండు మ్యాచ్లలో కూడా పేలవా ప్రదర్శన చేశాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత గాయం కారణంగా పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న యాషెష్ సిరీస్ కోసం ఇంగ్లాండు బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు బెన్ స్టోక్స్. ఈ విషయాన్ని చెన్నై యాజమాన్యం తెలిపింది.

 ఈ సీజన్ మొత్తంలో అతను ఆడిన రెండు మ్యాచ్ లలో కలిపి 15 పరుగులు మాత్రమే చేసిన బెన్ స్టోక్స్.. ఒక ఓవర్ బౌలింగ్ చేసి 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇప్పుడు కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ కి కూడా అందుబాటులో ఉండకుండా యాషెష్ సిరీస్ కోసం ఇంగ్లాండు పయనం అయ్యాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. బెన్ స్టోక్స్ ఐపీఎల్ ఆడటానికి వచ్చినట్లు లేదు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అతనికి వేలంలో పలికిన ధర ను కంపేర్ చేసి చూస్తే అతను చేసిన పరుగుల ప్రకారం ఒక్క పరుగుకి కోటి రూపాయలకు పైగానే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చెల్లించినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: