రింకు బ్యాటింగ్ పై.. గంభీర్ ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా యువ ఆటగాళ్లు తమలో దాగివున్న ప్రతిభను నిరూపించుకొని ఇక ఐపీఎల్లో స్టార్ హీరోలుగా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ తమ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించి స్టార్లుగా ఎదిగారు. కానీ ఒక్కడి పేరు మాత్రం గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ లో మారుమోగిపోతుంది. అతను బ్యాటింగ్ కి వచ్చాడు అంటే చాలు విధ్వంసం సృష్టిస్తాడు అనే భావన ఇక మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒక మ్యాచ్లో అసాధారణమైన ఇన్నింగ్స్ తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు అతగాడు. ఇంతకీ అతగాడు ఎవరో కాదు యంగ్ సెన్సేషన్ రింకు సింగ్.

 ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో నయా ఫినిషర్ గా అతను అవతరించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గుజరాత్ టైటాన్స్ లో జరిగిన మ్యాచ్లో యష్ దయాల్ బౌలింగ్లో చివరి మ్యాచ్లో ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి ఇక జట్టుకు ఓటమి ఖాయం అనుకున్న దశలో విజయాన్ని అందించిన అతని పేరు మారుమోగిపోయింది. అయితే ఆ తర్వాత మ్యాచ్లలో కూడా ఇక డెత్ ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్ విధ్వంశాన్ని కొనసాగిస్తూ ఫినిషిర్ గా అవతరిస్తూ ఉన్నాడు రింకు సింగ్. ఇక ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా రింకు సింగ్ బ్యాటింగ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి.

 ఒకవైపు వికెట్లు పడుతున్న అటు రింకు సింగ్ మాత్రం భయం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 203.03 స్ట్రైక్ రేట్ తో 33 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు రింకు సింగ్. అయితే కోల్కతా ఓడిపోయిన అతని వీరోచితమైన  ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకులు మది దోచేసింది. అయితే నయా ఫినిషిర్ రింకు సింగ్ బ్యాటింగ్ పై లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ అనంతరం రింకు సింగ్ తో సహా పలువురు కేకేఆర్ ఆటగాళ్లతో గంభీర్ వెళ్లి మాట్లాడాడు. వారితో తాను మాట్లాడుతున్న ఫోటోని గంభీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈరోజు రింకు చేసిన ప్రయత్నం అద్భుతం.. సెన్సేషనల్ టాలెంట్ అంటూ రింకు సింగ్  పై ప్రశంసలు కురిపించాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: