ఆ ఇద్దరే.. మా విజయావకాశాలను చంపేశారు : మార్కరమ్

praveen
2023 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఏడాదికి వరుస వైఫల్యాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టుకు కెప్టెన్ గా మార్కరమ్ వచ్చిన అతను ఎక్కడ జట్టును ప్రభావితం చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే వరుస మ్యాచ్లలో ఓడుతూ పాయింట్లు పట్టికలో ఎప్పటిలాగానే చివరి స్థానంలో కొనసాగింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన తర్వాత అయినా కనీసం దూకుడుగా ఆడుతుంది అనుకుంటే ఇక అలాంటి ఆట తీరు సన్రైజర్స్ లో ఎక్కడ కనిపించలేదు.

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మరోసారి బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది సన్రైజర్స్ జట్టు. అయితే సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ 11, రాహుల్ త్రిపాఠి 15 శుభారంభం ఇవ్వలేకపోయారు. అయితే ఆ తర్వాత జట్టును ఆదుకునేందుకు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన మార్కరమ్ సైతం కేవలం 18 పరుగులు మాత్రమే చేసే విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలోనే క్లాసెస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు.. ఆర్సిబి బౌలర్లపై వీర విహారం  చేసి బౌండరీలు బాదేశాడు.

 ఇక క్లాసెస్ కి హ్యారి బ్రూక్స్ 27 పరుగులతో చక్కటి సహకారం అందించాడు అని చెప్పాలి. దీంతో సన్రైజర్స్ 156 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్ తోనే బరిలోకి దిగిన ఆర్సిబి అద్భుతంగా బ్యాటింగ్ చేసింది అని చెప్పాలి. మొదటినుంచి జోరు చూపించిన విరాట్ కోహ్లీ ఎక్కడ సన్రైజర్స్ బౌలర్లపై కనికరం చూపించలేదు అని చెప్పాలి. చివరికి సన్రైజర్స్ కు ఓటమి తద్యంగా  మారిపోయింది. అయితే ఓటమిపై స్పందించిన మార్కరమ్ తాము బాగానే బ్యాటింగ్ చేశామని.. కానీ అవకాశాలను మాక్సిమం ఉపయోగించుకోలేకపోయాం అంటూ చెప్పాడు. హెన్రిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు.  డూప్లిసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరు మా విజయ అవకాశాలను చంపేసారు. చివరి వరకు పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు అంటూ మార్కరమ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: