తల్లిదండ్రులే కొడుకుని చంపారు.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు అంటే కడుపున పుట్టిన పిల్లలను ఎప్పుడు కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటారు. అయితే తల్లి ఎప్పుడు తన ప్రేమను బయటకు చూపించిన తండ్రి మాత్రం కాస్త గంభీరంగా కనిపించిన లోలోపులు మాత్రం పిల్లలపై కొండంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లిదండ్రులు చూస్తూ అస్సలు ఉండలేరు. ఆ కష్టాన్ని ఎంత పెద్దదైనా సరే దానిని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులే అందరికి పిల్లలకి మొదటి దైవం అని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం తల్లిదండ్రుల ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.

 ఎందుకంటే కడుపున పుట్టిన పిల్లలని దారుణంగా హత మారుస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకునీ పిల్లలను చంపుతుంటే మరి కొంతమంది ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను చంపి వారు కూడా ఆత్మహత్య చేసుకుంటూన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి కొంతమంది పెరిగి పెద్దయి ప్రయోజకుడు అవుతాడు అనుకున్న కొడుకు తాగి తందనాలు ఆడుతూ చివరికి తల్లిదండ్రులను వేధిస్తుంటే.. ఎందుకు వీడిని కన్నం రా బాబు అనే బాధపడి చివరికి రక్తసంబంధం లో ఉన్న తీపిని మరిచిపోయి ఇక కొడుకులను చంపుతున్న తల్లిదండ్రులు కూడా అక్కడక్కడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.

 ప్రయోజకుడు అవుతాడు అనుకున్న కొడుకు మధ్యానికి బానిసగా మారిపోయాడు. ప్రతిరోజు తాగటమే పనిగా పెట్టుకున్నాడు. ఇక తాగి వచ్చి తల్లిదండ్రులను హింసించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు మన కొడుకే కదా అని భరిస్తూ వచ్చారు తల్లిదండ్రులు. కానీ ఆ తర్వాత కొడుకు వేధింపులు తట్టుకోలేకపోయారు. దీంతో విసుకు చెందిన తల్లిదండ్రులు దారుణంగా అతని ప్రాణాలు తీసేసారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. మత్తుకు బానిసైన కొడుకుని కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. గాయాలకు తట్టుకోలేక అతను మరణించగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిప్పంటించి కాల్చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అస్సలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: