IPL 2023 ప్లేఆఫ్స్: పంజాబ్ కి ఢిల్లీ దిమ్మతిరిగే షాక్?

Purushottham Vinay
ఇక 'ప్లే ఆఫ్స్‌' రేసు నుంచి బయటకి వచ్చేసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ టీం ఇతర జట్ల సమీకరణాలను దెబ్బ తీసే పనిలో పడింది.షార్ప్ బ్యాటింగ్‌తో తొలిసారి సీజన్‌లో 200 పరుగుల స్కోరు చేసిన ఆ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ను దెబ్బ కొట్టింది. బుధవారం నాడు జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో పంజాబ్‌ టీం పై గెలిచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ మొత్తం 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారీగా 213 పరుగులు చేసింది.'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రిలీ రోసో (37 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఇంకా పృథ్వీ షా (38 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్‌), వార్నర్‌ (31 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించడం జరిగింది. ఆ తరువాత పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (48 బంతుల్లో 94; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగగా ఇంకా అథర్వ తైడే (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.ఈ ఓటమితో పంజాబ్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలు దాదాపుగా కోల్పోవడం జరిగింది.ఇక డేవిడ్ వార్నర్‌ అయితే ఎప్పటిలాగే శుభారంభం అందించగా... చాలా రోజుల తర్వాత మళ్లీ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న పృథ్వీ షా దానిని చాలా సమర్థంగా వాడుకున్నాడు.


రబడ ఓవర్లో వార్నర్‌ 2 సిక్స్‌లు కొట్టగా ఇంకా అర్ష్ దీప్‌ ఓవర్లో వరుస బంతుల్లో పృథ్వీ 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. ఇక పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. మొదటి వికెట్‌కు 62 బంతుల్లోనే 94 పరుగులు జోడించిన తర్వాత వార్నర్‌ వెనుదిరగ్గా, మూడో స్థానంలో వచ్చి న రోసో బాగా జోరుగా బ్యాటింగ్‌ చేశాడు.ఇక రబడ ఓవర్లో అతను 2 భారీ సిక్స్‌లతో పాటు ఫోర్‌ కూడా కొట్టాడు. ఆ తర్వాత 36 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్న పృథ్వీ ఆ వెంటనే వెనుదిరిగాడు. రోసో, సాల్ట్‌ (14 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో లాస్ట్ 2 ఓవర్లలోనే ఢిల్లీ 41 పరుగులు రాబట్టింది. హర్‌ప్రీత్‌ వేసిన లాస్ట్ ఓవర్లో రోసో 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టగా, అంతకుముందు ఎలిస్‌ వేసిన 19వ ఓవర్లో సాల్ట్‌ కూడా 2 సిక్స్‌లు ఇంకా ఫోర్‌ బాదాడు. మొత్తం 25 బంతుల్లోనే రోసో హాఫ్‌ సెంచరీని చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: