గుజరాత్ కొత్త జెర్సీ వెనుక.. కారణం అదేనట?

praveen
ఇటీవల ఐపీఎల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఎలాంటి ఉత్కంఠ లేకుండా పోయింది. ఎందుకంటే ఇక ముందు నుంచి అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ చేతిలో మరోసారి ఘోర ఓటమి చవిచూసింది అని చెప్పాలి.

 అయితే ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అటు గుజరాత్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్  సూపర్ సెంచరీ తో చెలరేగిపోయి అదరగొట్టాడు. అయితే ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టీం గురించే కాదు అయితే గుజరాత్ ధరించిన జెర్సీ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. రెగ్యులర్గా వేసుకునే జెర్సీ కాకుండా కొత్త జెర్సీతో సన్రైజర్స్ తో మ్యాచ్లో బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్ జట్టు. అయితే ఇలా గుజరాత్ ఎందుకు కొత్త జెర్సీ వేసుకుందబ్బా అని మ్యాచ్ జరుగుతున్నంత సేపు క్రికెట్ ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు అని చెప్పాలి.

 అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అనంతరం ఇక కొత్త రకం జెర్సీ ధరించి బలిలోకి దిగడం గురించి అటు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకే ఇలా లైట్ పింక్ కలర్ జెర్సీని ధరించాము అంటూ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.  ఇకనుంచి ప్రతి ఐపీఎల్ సీజన్లో కూడా ఒక మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఇక ఈ లైట్ పింక్ జెర్సీతో బరిలోకి దిగి మ్యాచ్ ఆడుతుంది అంటూ తెలిపాడు. అయితే ఐపీఎల్లో ఆర్సిబి కూడా ఇలా ఒక మ్యాచ్ కోసం గ్రీన్ జెర్సీని ధరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భూమిపై పచ్చదనాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఇలా గ్రీన్ జెర్సీని ధరిస్తుంది బెంగళూరు టీం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: