అదృష్టమంటే ముంబై ఇండియన్స్ దే.. ఎందుకంటే?

praveen
ఐపీఎల్ పోరు ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మొన్నటి వరకు లీగ్ మ్యాచ్లు ఎంటర్టైన్మెంట్ పంచగా ఇక ఇప్పుడు ప్లే ఆఫ్ మ్యాచ్ లకు సమయం ఆసన్నమవుతుంది. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టబోయే నాలుగు జట్లు ఏవి అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది మొదటి నుంచి కాస్త పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఒక్కసారిగా ప్లే ఆఫ్ గణాంకాలను మొత్తం మార్చేసింది అని చెప్పాలి.

 ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది ముంబై ఇండియన్స్ జట్టు. దీంతో ప్రస్తుతం ప్లే ఆఫ్ రేసు మరింత ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధిస్తూ ఇక ఎవరికీ అందనంత దూరంలో ఉంది. అయితే గుజరాత్ జట్టును మొదటి స్థానం నుంచి కిందికి దించడం మాత్రం దాదాపు అసాధ్యమని చెప్పాలి.  రెండు మూడు స్థానాల విషయంలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య గట్టి పోటీ ఉంది అన్నది ప్రస్తుతం అర్థం అవుతుంది.

 ఇటీవలే కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలిచి ఉంటే ముంబైకి అటు రెండో స్థానంలోకి చేరే అవకాశం చాలా తక్కువగా ఉండేది.  కానీ ఇటీవల చెన్నై ఓడిపోవడంతో ముంబైకి మంచి అవకాశం లభించింది. ముంబై తాను ఆడబోయే రెండు మ్యాచ్లలో గెలిస్తే 18 పాయింట్లతో టాప్ 2 లో నిలుస్తుంది దీంతో క్వాలిఫైయర్ వన్ లో ఓడిపోయిన.. ఫైనల్ వెళ్లేందుకు రోహిత్ సేనకు మరో ఛాన్స్ లభిస్తుంది.  ఈ విషయం తెలిసి అదృష్టమంటే ముంబై ఇండియన్స్ కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెడుతుందో లేదో అనుకున్న టీం ఇక ఇప్పుడు క్వాలిఫైర్ వన్ లో ఆడి.. ఇక ఫైనల్ కోసం మరో ఛాన్స్ కొట్టేయబోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: