ధోని రిటైర్మెంట్ పై.. షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పిన చెన్నై సీఈవో?

praveen
2023 సీజన్ ప్రారంభం కాకముందు నుంచి కూడా ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ గురించి. అయితే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ధోని ఆటను చూసి ఎందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది. దీంతో ఐపీఎల్ లో ధోని ఆటను చూస్తూ మైమరిచిపోతున్నారు అభిమానులు. కానీ వచ్చేయడాది నుంచి మాత్రం అలాంటి ఛాన్స్ ఉండదు అంటూ వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఎందుకంటే 2023 ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరిగింది.

 దీంతో మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇలా ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోని మాత్రం ఎక్కడ నోరు విప్పింది లేదు. అయితే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో చపాక్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోని స్టేడియం మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. సాధారణంగా రిటైర్మెంట్ ప్రకటించే ముందు ఆటగాళ్లు ఇలా చేస్తూ ఉంటారు.. దీంతో ధోని కూడా ఇక రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. హోమ్ గ్రౌండ్ చెపాక్ లో ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

 ఇక ధోని ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే రిటైర్ అవ్వబోతున్నాడు అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేంద్రసింగ్ ధోని వచ్చే సీజన్లో ఆడతాడని గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి ఫ్యాన్స్ ప్రతిసారి మాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ధోని రిటైర్మెంట్ పై ఆందోళనలో ఉన్న అభిమానుల్లో చెన్నై జట్టు సీఈవో కామెంట్స్ కొత్త ఆశలు చిగురించేలా చేస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: