రాసి పెట్టుకోండి.. ఆ కుర్రాడు మంచి ఫినిషర్ అవుతాడు : రైనా

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి ఏడాది కూడా ఎంతోమంది కుర్రాళ్లు తమ ఆట తీరుతో అదరగొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా ప్రతి ఏడాది కొత్త ప్రతిభ తెరమీదకి వస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఐపిఎల్ లో రాణించినవారు ఎలాంటి కండిషన్స్ లేకుండానే.. నేరుగా టీమిండియాలో అడుగుపెడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు వెంకటేశ్ అయ్యర్, బుమ్రా  లాంటి ఎంతో మంది ఆటగాళ్లు ఇలా ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి వచ్చినవారే.

 అయితే ఈ ఏడాది కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ఆట తీరుతో అదరగొడుతూ ఉండగా.. ఒక యువ ఆటగాడి గురించి మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేష్ శర్మ. అతని ఆట తీరు చూసి మాజీ క్రికెటర్లు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ లిస్టులో ఇప్పుడు సురేష్ రైనా కూడా చేరిపోయాడు. అయితే ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన సురేష్ రైనా జితేష్ శర్మ పై ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి.

 ప్రస్తుతం అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తున్న జతేష్ శర్మ త్వరలోనే టీమ్ ఇండియాలో భాగం కాగలడు అంటూ అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ కీపర్ మిడిల్ ఆర్డర్లో జట్టుకు చాలా మంచి ఎంపిక అని నిరూపించగలడు. అతను హిట్టింగ్ సామర్ధ్య ఎంతో బాగుంది. మంచి ఫినిషిర్ కాగలడు అంటూ రైనా చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 26.5 సగటుతో 160 కి పైగా స్ట్రైక్ రేటుతో 260 పరుగులు చేశాడు జితేష్ శర్మ. వికెట్ల వెనకాల కూడా ధోని లాగా ఎంతో హుషారుగా కనిపిస్తున్నాడు. ఇలా ఒకరకంగా ధోని లాగా వికెట్ కీపర్ గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కూడా  జితేష్ శర్మ టీమిండియా కు బాగా ఉపయోగపడతాడని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: