గాయం వేధిస్తున్నా.. ధోని సింహంలా రెచ్చిపోయాడు?

praveen
మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకొన్నిసార్లు ధోని డెడికేషన్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఒక ఆటగాడిగా కెప్టెన్గా తాను ఎంత గొప్ప ప్లేయర్ అన్న విషయాన్ని నిరూపించుకున్న మహేంద్రసింగ్ ధోని.. ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా అభిమానులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే కొన్ని కొన్ని సార్లు గాయం వేధిస్తూ ఉన్నప్పటికీ ఇక జట్టును గెలిపించడం కోసం వీరుడిలా ధోని పోరాడిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో గత కొన్ని మ్యాచ్ల నుంచి మహీంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతూ ఉన్నాడు. మోకాలి గాయం నుండి పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ ఇక వరుసగా మ్యాచ్లో ఆడుతూనే ఉన్నాడు. ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూనే ఇక వికెట్ల వెనకాల ఎంతో అలర్ట్ గా ఉంటున్నాడు. ఇక ఇటీవల హెలికాప్టర్స్ తో జరిగిన మ్యాచ్లో సైతం ఒకవైపు గాయం బెడద వేధిస్తున్న ధోని బ్యాటింగ్ కి వచ్చాడు.

 ఇందుకు సంబంధించిన ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో ధోని మోకాలికి కట్టుతో కనిపించాడు. ఇక 19వ ఓవర్లో బ్యాటింగ్ కి వచ్చిన ధోని 6, 4, 2, 6 పరుగులు భారీ అదరగొట్టాడు. అతను చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్లే అటు చెన్నై సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది అని చెప్పాలి. అయితే 42 ఏళ్ళ వయసులో కూడా ధోని క్రికెట్ పట్ల చూపిస్తున్న డెడికేషన్ చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి డెడికేషన్ ఉంది కాబట్టే ధోని భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిగా మారిపోయాడు అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: