లక్నో జట్టుకు మరో షాక్.. ఇంటికెళ్లిన స్టార్ ప్లేయర్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువగా క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒకప్పుడైతే ఇక ప్రతి మ్యాచ్ లో ఏ జట్టు పై చేయి సాధిస్తుంది అనే దానిపై ప్రేక్షకులు ముందు నుంచి ఒక అంచనాకు వచ్చేవారు. ప్రేక్షకుల అంచనాకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చేది. కానీ ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంటే ఎప్పుడు ఎవరు రాణిస్తారు.. ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది కూడా ముందుగా ఊహించలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇక ప్రతి బంతిని వీక్షిస్తూ మ్యాచ్ ను ఆస్వాదించడం తప్ప రివ్యూలు ఇవ్వలేకపోతున్నారు.

 ఎందుకంటే అన్ని జట్లు కూడా హోం గ్రౌండ్లలో ఓడిపోవుతూ ఇతర గ్రౌండ్లలో మాత్రం విజయం సాధిస్తూ ఉన్నాయ్.  అంతేకాదు గెలుస్తుంది అనుకున్న జట్టు ఓడిపోయి.. ఓడిపోతుంది అనుకున్న జట్టు గెలవడం కూడా జరుగుతుంది. అయితే దీంతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందుతుంది. అదే సమయంలో ఐపీఎల్లో అన్ని జట్లను గాయాలు బెడద కూడా తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా లక్నో జట్టుకు గత కొన్ని రోజుల నుంచి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పాలి. మొన్నటికి మొన్న కెప్టెన్ కే ఎల్ రాహుల్ గాయం కారణంగా ఇక టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లక్నో జట్టు మంచి దూకుడు మీద ఉన్న సమయంలో ఇలాంటి ఎదురు దెబ్బ తగిలింది.

 అయితే ఇక ఇప్పుడు లక్నో కి మరో షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న ఒక ఆటగాడు ప్రస్తుతం దూరం కాబోతున్నాడట. లక్నో జట్టులో స్టార్ క్లియర్గా ఉన్న మార్క్ వుడ్ ఇటీవల స్వదేశానికి వెళ్ళిపోయాడు. నా భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందుకే స్వదేశానికి వెళ్తున్న. మళ్లీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తా. నన్ను క్షమించండి. లక్నో లాంటి ఫ్రాంచైజీ తో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా జట్టు మరింత విజయవంతంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న అంటూ మార్క్ వుడ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: