డబ్ల్యూటీసి ఫైనల్.. కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరొచ్చారంటే?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది . అయితే ఐపిఎల్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెట్ ప్రేక్షకులు ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత డబ్ల్యూటీసి ఫైనల్ పోరు కోసం కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అయితే సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి విశ్వవిజేతగా నిలవాలని భారత జట్టు భావిస్తుంది. అయితే ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇక బీసీసీఐ కసరత్తులు చేస్తుంది. ఇటీవల 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది.

 కానీ ఊహించని రీతిలో అటు ఐపీఎల్ కారణంగా బీసీసీఐకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయ్. ఎందుకంటే ఐపీఎల్ లో నిర్విరామంగా మ్యాచ్లు ఆడుతున్న ఎంతోమంది భారత ప్లేయర్లు గాయం బారిన పడుతున్నారు. దీంతో ఇక బిసిసిఐ ముందుగా ప్రకటించిన డబ్ల్యూటీసి ఫైనల్ జట్టులో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఇటీవల గాయం బారిన పడి ఐపిఎల్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ మాత్రమే కాదు డబ్ల్యూటీసి ఫైనల్ కు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.

 దీంతో అతని స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసి ఫైనల్ కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి. మరి టెస్ట్ జట్టులో వచ్చిన ఛాన్స్ ని ఇషాన్ కిషన్ ఎంత మేరకు ఉపయోగించుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటికే బుమ్రా, శ్రేయస్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు గాయం కారణంగా డబ్ల్యూటీసి ఫైనల్ కు దూరమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: