ఫైన్ వేయడం కాదు.. వారిపై నిషేధం విధించండి : గవాస్కర్

praveen
ఇటీవల ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జేయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతలా వార్తల్లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మ్యాచ్ లో లక్నో జట్టును వారి హోమ్ గ్రౌండ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడించింది. గతంలో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో.. లక్నో చేతిలో ఓడిపోయిన ఆర్సిబి ఇటీవల వారి హోమ్ గ్రౌండ్ లోనే లక్నో జట్టుని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే గతంలో ఇక లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ ఆర్సిబి అభిమానులను ఉద్దేశించి చేసిన పనికి గాను ఇక ఇటీవలే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రతీకారం తీర్చుకొని కౌంటర్ ఇచ్చాడు. గతంలో గౌతమ్ గంభీర్ ఆర్సిబి అభిమానులకు సైగలు చేసినట్లుగానే.. ఇటీవలే మ్యాచ్లో సైలెంట్ గా ఉండాలి అంటూ లక్నో అభిమానులకు సైగలు చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ పరస్పరం ఎదురుపడి ఇక గొడవకు దిగడం సంచలనం మారిపోయింది.  ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారేమో అనేంతలా వీరి మధ్య గొడవ జరిగింది.

 అయితే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ ఇద్దరి మ్యాచ్ ఫీజులో 100% కోత విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఇదే విషయంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. వారికి మ్యాచ్ ఫీజులో 100% ఫైన్ వేసినప్పటికీ అది చాలదని కఠిన శిక్ష వేయాల్సిందే అంటూ సూచించాడు. ఫ్రాంచైజీ యాజమాన్యాలు మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అంటూ సూచించాడు. గతంలో హర్భజన్, శ్రీశాంత్ విషయంలో ఇలాగే జరిగితే కొన్ని మ్యాచ్లు ఆడకుండా వారిపై నిషేధం విధించారు అన్న విషయాన్ని గుర్తు చేశాడు. వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటే ఇక మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా టోర్నీ ప్రశాంతంగా జరుగుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు సునీల్ గవాస్కర్. ఒకరకంగా కొన్ని మ్యాచ్లకు వీరిద్దరిపై నిషేధం విధించాలి అంటూ చెప్పకనే చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: