ధోని, కోహ్లీలే నాకు స్ఫూర్తి.. యంగ్ సెన్సేషన్ యశస్వి?

praveen
సాధారణంగా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే అటు కొత్త ప్రతిభకు చిరునామాగా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో కనిపించిన ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రానిస్తూ సత్తా చాటుతూ ఉంటారు అని చెప్పాలి. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్త యువ ఆటగాళ్లు తెరమీదకి వస్తూనే ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా తన ప్రదర్శనతో ఇలా ఐపిఎల్ ప్రేక్షకులందరి దృష్టిని కూడా తన వైపుకు తిప్పుకుంటున్నాడు లక్నో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్.

 ఇప్పటికే ఇతను అటు దేశవాళి క్రికెట్లో సంచలనంగా  పేరు సంపాదించుకున్నాడు. రంజీ ట్రోఫీతో పాటు మరి కొన్ని దేశవాలి టోర్నీలలో కూడా సెంచరీల మోత మోగించి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా  43 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేశాడు.

 ఒకరకంగా చెప్పాలి అంటే అతనే జట్టును ముందుండి నడిపించి గెలిపించాడు. ఈ క్రమంలోనే తన ఇన్నింగ్స్ లపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్లు అయినా మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ల నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని.. నా కెరియర్ సాఫీగా సాగడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటూ యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు. మరి ఈ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ ఆటగాడికి అటు భారత సెలెక్టర్ల కటాక్షం లభిస్తుందో లేదో అన్నది ఐపీఎల్ ముగిసిన తర్వాత తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: