డబ్ల్యూటీసి ఫైనల్.. రోహిత్ కు సలహా ఇచ్చిన గవాస్కర్?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎంతోమంది భారత ఆటగాళ్లు వరుసగా మ్యాచ్లు ఆడుతూ బిజీబిజీగా గడుపుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తో తలబడబోతుంది టీమ్ ఇండియా జట్టు.  ఈ క్రమంలోనే అటు ఐపిఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లు ఎలాంటి విశ్రాంతి లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్ లో పాల్గొంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై మాట్లాడుతున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.

 ఇటీవల బీసీసీఐ డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోయే 15 మంది టీం మెంబెర్స్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. అయితే ఇలా డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపికైన ఆటగాళ్లు ఇక ఐపీఎల్ లో కొన్ని తక్కువ మ్యాచ్ లు ఆడి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది.. అలా అయితేనే డబ్ల్యూటీసి ఫైనల్ లో మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంటుందని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం స్పందించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కొంతకాలం పాటు ఐపీఎల్ నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు సునీల్ గవాస్కర్.

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరం అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్. రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చివర్లో మూడు లేదా నాలుగు మ్యాచ్లు ఆడితే సరిపోతుందని సునీల్ కవాస్కర్ సలహా ఇచ్చాడు. ఎందుకంటే అతను ఐపీఎల్ ముగిసిన తర్వాత తక్కువ గ్యాప్ లోనే జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం గాయాలు లేకుండా ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: