ఆ ఒక్క బౌలర్.. నేను సెట్ చేసిన ఫీల్డింగ్ మారుస్తాడు : ధోని

praveen
సాధారణంగా ఏ మ్యాచ్లో అయినా సరే బౌలింగ్ చేయడానికి వచ్చిన బౌలర్లు తమకు అనుకూలంగా మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు మాత్రం ఇది అస్సలు కుదరదు. ఎందుకంటే ఇక అక్కడ బంతులు వేసే బౌలర్ ని బట్టి వికెట్ల వెనకాల ఉండే మహేంద్రసింగ్ ధోని మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక మహి ఒకసారి ఫీల్డింగ్ సెట్ చేస్తే అటు బౌలర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడు.  గతంలో ఒకసారి దీపక్ చహార్ ఫీల్డింగ్ మార్చాలి అని ధోని కోరితే.. బౌలర్ ని మారుస్తాను అంటూ మహి వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది.


 అయితే మహేంద్ర సింగ్ ధోనీకి అంత అనుభవం ఉంది కాబట్టి ఇలా బౌలింగ్ వేయడానికి వచ్చిన ఏ బౌలర్ కూడా మహేంద్రసింగ్ ధోని సెట్ చేసిన ఫీల్డింగ్ ని మళ్లీ మార్చడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఒక సీనియర్ బౌలర్ మాత్రం ధోని ఫీల్డింగ్ సెట్ చేసిన తర్వాత కూడా తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చేస్తూ ఉంటాడట  అతను ఎవరో కాదు అటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన మాజీ బౌలర్ కావడం గమనార్హం. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్న డీజే బ్రావో ఇలా చేస్తూ ఉంటాడట.  గతంలో  చెన్నై జట్టుకు ఆడిన బ్రావో ఇప్పుడు అదే జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

 అయితే బ్రావో ఒక్కడే నేను సెట్ చేసిన ఫీల్డింగ్ ని అస్సలు ఒప్పుకోడు  అతన్ని ఇక్కడ.. అతని అక్కడ అంటూ నేను సెట్ చేసిన ఫీల్డింగ్ మొత్తం మార్చేస్తాడు. నేను ఏమీ అనలేను. ఎందుకంటే బ్రావోకి నాకంటే ఎక్కువ టి20 అనుభవం ఉంది. అందుకే తనకు నచ్చినట్లుగా ఫీల్డింగ్ సెట్ చేస్తాను అంటూ మహేంద్రసింగ్ ధోని కామెంట్ చేశాడు అని చెప్పాలి. ఇకపోతే గత ఏడాది బ్రావో తప్పుకున్నట్లుగానే   ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని కూడా ఐపీఎల్ కెరీర్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఐపిఎల్ నుంచి తప్పుకున్న తర్వాత అదే చెన్నై జట్టుకి బ్యాటింగ్ కోచ్గా మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించబోతున్నాడు అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: