SRH vs DC: హైదరాబాద్ తో వార్నర్ మామ ఫైట్?

Purushottham Vinay
మన తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటా పోటీగా తలపడనుంది.ఇక హైదరాబాద్ సిటీ వేదికగానే జరిగే ఈ ఐపీఎల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలాగే మరోవైపు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండే గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6 మ్యాచ్‌లకు ఒక విజయంతో 10 స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలని డేవిడ్ వార్నర్ టీం చూస్తోంది.ఇక వీటికి తోడు గతంలో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్.. ఇప్పుడు అదే టీమ్‌పై పోటీ పడి గెలవాలని చూస్తున్నాడు.తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు బాగా చేరువైన వార్నర్ నాయకత్వంలోనే సన్‌రైజర్స్ టీమ్ 2016 వ సంవత్సరంలో ఐపీఎల్ కప్ ని సాధించింది.ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్‌పై సన్‌రైజర్స్ వేటు వేసి సమర్థ్ వ్యాస్‌ను టీమ్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మిగిలిన స్థానాలలో ఎటువంటి మార్పులు లేకపోవచ్చు. ఇక టీమ్ ఓపెనర్ హ్యరీ బ్రూక్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ ఇంకా హెన్రిచ్ క్లాసెన్ వంటి మిడిలార్డర్ల నుంచి కూడా మంచి కూడా నాక్ రావాల్సి ఉంది. ఇంకా అలాగే టీమ్‌లో భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ అలాగే వాషింగ్టన్ సుందర్ వంటి బలమైన బౌలర్లు ఉన్నా కూడా వికెట్లు తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు.


ఇక ఇదిలా ఉండగా.. ఢిల్లీ టీం పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంది. ఆ టీమ్ నుంచి కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇంకా అక్షర్ పటేల్ తప్ప మిగిలిన బ్యాటర్లు కనీసం పరుగులు చేసేందుకు కూడా చాలా మొహమాటపడుతున్నారు. కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే ఇంకా ఇషాంత్ శర్మ వంటి బౌలర్లతో బౌలింగ్ పటిష్టంగానే ఉన్నా బ్యాటర్లు ఇంకా రాణించాల్సి ఉంది.అయితే ఈ రెండు జట్ల మధ్య ఉన్న రికార్డ్ పరంగా చూస్తే ఢిల్లీ టీమ్‌పై హైదరాబాద్‌ టీందే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 21 సార్లు తలపడిన ఈ టీంలు హైదరాబాద్ 11, ఢిల్లీ 10 విజయాలు సాధించడం జరిగింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వస్తే..హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్‌, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ ఇంకా వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్ ఆడనున్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వస్తే..డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్ ఇంకా అలాగే లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ ఆడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: