హార్దిక్ తీరుతో.. నాకు తలనొప్పి వచ్చింది : కాలింగ్ వుడ్

praveen
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన నాయకత్వ ప్రతిభను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు అని చెప్పాలి. గత ఏడాది ఐపీఎల్ లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారధిగా వ్యవహరించిన హార్థిక్ పాండ్యా మొదటి ప్రయత్నంలోనే జట్టును ఛాంపియన్గా నిలిపాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతని కెప్టెన్సీ ప్రతిభను చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా అదరగొడతాడు అని తెలుసు. కానీ కెప్టెన్ ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు అని ఊహించలేదు అంటూ ఎంతో మంది కామెంట్లు చేశారు.

 గత ఏడాది ఐపీఎల్ తర్వాత అటు భారత క్రికెట్లో సైతం ఫ్యూచర్ కెప్టెన్ ఎవరో కాదు హార్దిక్ పాండ్యానే అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్లో కూడా హార్దిక్ పాండ్య తన ప్రతిభతో మరోసారి అదరగొడుతూ ఉన్నాడు. జట్టును క్లిష్ట పరిస్థితుల్లో అతను ముందుకు నడిపిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి.  ఇక ఇటీవల మరోసారి హార్దిక్ పాండ్యా ఓడిపోవాల్సిన మ్యాచ్ లో కూడా జట్టును గెలిపించి అదరగొట్టాడు అని చెప్పాలి. కేవలం 134 పరుగుల స్వల్ప స్కోరుని కాపాడుకుంటూ ఏడు  పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది గుజరాత్ టైటాన్స్.

 ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా నాయకత్వ ప్రతిభ పై ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ పాల్ కాలింగ్ వుడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్థిక్ పాండ్యా ఒక రాక్ స్టార్ అంటూ వ్యాఖ్యానించాడు పాలు కాలింగ్ వుడ్. ఇప్పుడు ఉన్న ఆటగాళ్ళలో అత్యంత ఎంటర్టైనర్ హార్దిక్ పాండ్యనే. జట్టుని ముందుండి నడిపిస్తాడు. నేను ఇంగ్లాండ్ కోచ్గా ఉండి భారత్తో ఆడినప్పుడు నాకు తలనొప్పి తప్పించాడు అంటూ వ్యాఖ్యానించాడు. తన ప్రదర్శనతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా గేమ్ చేంజ్ చేయగల సత్తా హార్దిక్ పాండ్యాకు ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు పాల్ కాలింగ్ వుడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: